రెండు బస్సులు ఢీ: ఇద్దరు మహిళలతోపాటు ఏడుగురు మృతి, 25మందికి గాయాలు
సేలం: తమిళనాడులోని సేలం వద్ద శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా 25 మంది తీవ్రంగా గాయపడ్డారు.

సేలం నుంచి ధర్మపురికి ప్రయాణికులతో రాంగ్ రూట్‌లో వెళ్తున్న ఓ బస్సును.. బెంగళూరు నుంచి సేలంకు వెళ్తున్న బస్సు ఢీకొట్టడంతో ఈప్రమాదం చోటుచేసుకుంది. దీంతో ఘటనాస్థలిలోనే ఏడుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు.
సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, అధికారులు క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనాస్థలిలో వర్షం కురుస్తుండటంతో సహాయకచర్యలకు కొద్దిసేపు ఆటంకం ఏర్పడింది. ప్రమాదం కారణంగా ఆ మార్గంలో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది.












Click it and Unblock the Notifications