సెల్యూట్.. దీపక్ వసంత్.. ప్రాణాలను ఫణంగా పెట్టి కాపాడారు, ధైర్య సాహసాలను కీర్తిస్తోన్న ప్యాసెంజర్స్
కోజికోడ్ విమాన ప్రమాదం నుంచి బయటపడ్డ వారు షాక్ నుంచి ఇంకా తేరుకోలేదు. కానీ తమను కాపాడింది మాత్రం పైలట్ దీపక్ వసంత్ సాతే అని చెబుతున్నారు. తమకు మరో జన్మను అతనే ప్రసాదించాడని.. ఆపద సమయంలో కూడా తెలివిగా వ్యవహారించి.. ప్రయాణికుల ప్రాణాల కోసం తన ప్రాణాలను ఫణంగా పెట్టాడని తెలిపారు. విమానం ల్యాండయిన తర్వాత మంటలు చెలరేగకుండా నివారించి... తమ పాలిట దేవుడిలా మారాడాని కీర్తిస్తున్నారు.

ప్రాణాలను ఫణంగా పెట్టి..
ప్రమాదం జరిగిన ప్రయాణికుల ప్రాణాల కోసం తన ప్రాణాన్ని పైలట్ ఫణంగా పెట్టారని తెలిపారు. అతను కనబరిచిన ధైర్య సాహసాలతో తాము ఊపిరి పీల్చుకుంటున్నామని పేర్కొన్నారు. దీపక్ సాతే మంచి అనుభవనం ఉన్న పైలట్.. అందుకోసమే విమానం రెండు ముక్కలైన.. భారీ ప్రాణ నష్టం కాకుండా నివారించగలిగారు.

22 ఏళ్ల అనుభవం సొంతం..
దీపక్ సాతే.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఫైటర్‌గా పనిచేశారు. 59 ఏళ్ల దీపక్‌కు 22 ఏళ్ల అనుభవం ఉంది. 1981లో హైదరాబాద్ సమీపంలో గల దుండిగల్ వైమానిక దళం అకాడమీ నుంచి పట్టబద్రుడయ్యారు. ఖాడక్వాస్లలాలో పైలట్‌గా శిక్షణ కూడా తీసుకున్నారు. వైమానిక దళంలో ప్రతిభకు అందజేసే ‘స్వార్డ్ ఆఫ్ హానర్' కూడా పొందారు.
Recommended Video

రన్ వే పై నీరు.. వర్షం కురవడంతో..
అయితే శుక్రవారం రాత్రి విమానం ల్యాండయ్యే సమయంలో వర్షం కురవడం.. రన్ వేపై వర్షపు నీరు ఉండటంతో దీపక్ దానిని సరిగా అంచనా వేయలేకపోయారు. దీంతోపాటు అది హిల్ స్టేషన్‌పై ఉన్న రన్ వే కావడం కూడా ప్రతికూలంగా మారింది. వెదర్ అనుకూలించకపోవడంతో ప్రమాదం జరిగింది. రెండుసార్లు అదుపుతప్పిన సురక్షితంగా ల్యాండ్ చేసేందుకు ప్రయత్నించారని.. కానీ స్కిడయ్యి రెండు ముక్కలైందని ప్రాణాలతో బయటపడ్డ ప్రయాణికుడు ఒకరు తెలిపారు.

నోట రానీ మాట..
ప్రమాదం తర్వాత నోట మాట రాలేదని.. ఆక్సిడెంట్‌కు సంబంధించి ఏమీ గుర్తులేదని మరో ప్రయాణికుడు తెలిపారు. విమానంలో 190 మంది ఉండగా.. 123 మంది గాయపడ్డారు. వీరిలో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కొందరికీ వెన్నెముకకు తీవ్ర గాయాలు అయ్యాయి. 38 మంది కోజికోడ్ ఎంఐఎంఎస్ ఆస్పత్రి, 28 మంది బేబీ మెమోరియల్ ఆస్పత్రి, 14 మంది మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications