• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

దిగివచ్చిన శ్యాం....సిక్కు అల్లర్లపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ.... శ్యాంపిట్రోడా

|

కాంగ్రెస్ పార్టీ, బీజేపీల మధ్య కాంగ్రెస్ పార్టీ ఓవర్సీస్ విభాగం ఇంచార్జ్ , శ్యామ్ పింట్రోడ 1984లో జరిగిన సిక్కుల ఊచకోతపై చేసినవ్యాఖ్యలుకాంగ్రెస్ ,బీజేపీల మధ్య రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై ఆయన క్షమాపణలు చెప్పాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈనేపథ్యంలో శ్యామ్ పిట్రోడా కూడ స్పందించారు. శ్యామ్ పింట్రోడా చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతమని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన కొద్దిసేపటికే శ్యాంపిట్రోడా సిక్కు అల్లర్లపై చేసిన వ్యాఖ్యలపై ఆయన క్షమాపణ చెప్పారు.

శ్యాంపిట్రోడా వ్యాఖ్యలపై అభ్యంతరం చెప్పిన ప్రధాని నరేంద్రమోడీ

శ్యాంపిట్రోడా వ్యాఖ్యలపై అభ్యంతరం చెప్పిన ప్రధాని నరేంద్రమోడీ

సిక్కుల ఉచకోతకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఓవర్సీస్ ఇంచార్జ్ అయిన శ్యామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపుతున్న విషయం తెలిసిందే..ఈ అంశంపై బీజేపీ పెద్ద ఎత్తున ఎదురు దాడికి దిగింది. గతంలో జరిగిన అంశాలు ప్రజలకు తెలియవని పేర్కోంటున్న నేతలు శ్యామ్ పింట్రోడా వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ వైఖరికి నిదర్శమని ఏకంగా ప్రధాని నరేంద్రమోడీ వ్యాఖ్యానించారు. ఈనేపథ్యంలోనే ఆయన క్షమాపణ చెప్పాలని బీజేపీ శ్రేణులు డిమాండ్ చేశారు..

శ్యాంపిట్రోడా వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం ..కాంగ్రేస్ పార్టీ

శ్యాంపిట్రోడా వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం ..కాంగ్రేస్ పార్టీ

పిట్రోడా వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ స్పందిస్తూ .. వ్యక్తులు చేసే ప్రకటనలకు పార్టీకి సంబంధం లేదని అవి వారి వ్యక్తిగత అభిప్రాయమని కాంగ్రెస్ పార్టీప్రకటించింది.ఈనేపథ్యంలోనే పార్టీ నేతలు జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. ఇక 1984తోపాటు 2002 జరిగిన అల్లర్ల కేసుకు సంబంధించి న్యాయం జరగాల్సిన అవసం ఉందని, కాని బాధితులకు న్యాయం జరగాలని బీజేపీ కోరుకోకపోవడంతో పాటు సిక్కుల అల్లర్ల అంశంపై ఓట్లను రాబట్టే పనిలో ఉందని ఓ ప్రకటనలో కాంగ్రెస్ పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది.

నా వ్యాఖ్యలకు చింతిస్తున్నానంటూ క్షమాపణ..

నా వ్యాఖ్యలకు చింతిస్తున్నానంటూ క్షమాపణ..

పిట్రోడా వ్యాఖ్యలు త్వరలో జరగనున్న ఢిల్లి ఎన్నికలపై పడే ప్రమాదం ఉన్న నేపథ్యంతో పాటు ,పెద్ద ఎత్తున దుమారం రేగడంతో శ్యామ్ పిట్రోడా దిగివచ్చారు. సిక్కుల ఉచకోతకు సంబంధించిన తాను చేసిన వ్యాఖ్యలు పార్టీ అభిప్రాయాలు కాదని ప్రకటించారు. ఈనేపథ్యంలో నా వ్యాఖ్యల్ని కాంగ్రేస్ పార్టీ వక్రీకరిస్తుందని శ్యామ్ పిట్రోడా అన్నారు. కాగా బీజేపీ తమ వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవడానికే పదేపదే ఒకే మాటలను తీసుకునిప్రచారం చేస్తుందని అన్నారు. అయినా వాటిపై తాను విచారం వ్యక్తం చేశానని అన్నారు. సిక్కుల ఉచకోత తనను ఎంతగానో కలచివేసిందని ,అయినా అప్పటి సంఘటన ఇప్పటి ఎన్నికల్లో ఎందుకని మాత్రమే అన్నానని ఆయన స్పష్టం చేశారు.వీటిని బీజేపీ వక్రీకరించి ప్రచారం చేస్తుందని అన్నారు.అయితే తనకు హింది సరిగా రాకపోవడంతో ఇలాంటీ వ్యాఖ్యలు చేశానని ఆయన స్పష్టం చేశారు.

ఇంతకీ శ్యామ్ పింట్రోడా ఏమన్నాడు

ఇంతకీ శ్యామ్ పింట్రోడా ఏమన్నాడు

1984 లో జరిగిన సిక్కుల ఉచకోత ఆదేశాలు అప్పటి ప్రధానిగాఉన్న రాజీవ్ గాంధీ కార్యాలయం నుండే వచ్చాయని బీజేపీ నేతలు ట్వీట్ చేశారు. అయితే వాటిపై స్పందించిన శ్యామ్ పిట్రోడా ఓ ప్రయివేట్ చానల్ కు ఇచ్చిన ఇంటర్యూలో శ్యామ్ పింట్రోడా మట్లాడుతూ ...''అప్పటి సమస్య ఇప్పుడెందుకు'', ''అయితే ఏంటీ'' అంటూ సమాధానం ఇస్తూనే..1984 లో జరిగిన సంఘటన ఇప్పుడు ఎందుకు ప్రధాని నరేంద్ర మోడీ హాయంలో ఏం జరిగిందో చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో పిట్రోడా వ్యాఖ్యలపై బీజేపీకి చెందిన శిరోమణి అకాలీదల్ పెద్దఎత్తున్ అభ్యంతరాలు వ్యక్తం చేసింది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Congress leader Sam Pitroda on Friday apologised for his so what, it happened remark, reportedly made about the 1984 anti-Sikh riots. The Indian Overseas Congress chief said that his statement was "misrepresented and blown out of proportion"
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more