వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యూపీలో రెండు విడతల్లో మాదే పై చేయి - వంద సీట్లు సాధిస్తాం : అఖిలేష్ ధీమా..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

దేశం మొత్తం ఆసక్తిగా చూస్తున్న ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో మూడో దశకు రంగం సిద్దమైంది. ఆదివారం మూడో దశ పోలింగ్ జరగనుంది. మొత్తం ఏడు విడతలుగా జరగనున్న యూపీ ఎన్నికల్లో ఇప్పటికే రెండు దశల పోలింగ్ ముగిసింది. రెండు విడతల్లోనూ తమదే అధిక్యం అంటూ బీజేపీ...ఎస్పీ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. తొలి విడత పోలింగ్ జరిగిన 58 సీట్లలో 50 స్థానాలు తాము గెలవబోతున్నామంటూ ఇప్పటికే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చెప్పుకొచ్చారు. అయితే, తాజాగా.. రెండు దశల అసెంబ్లీ ఎన్నికల్లో తాము సెంచరీ కొట్టామని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ చెప్పారు.

ధీమాగా కనిపిస్తున్న అఖిలేష్

ధీమాగా కనిపిస్తున్న అఖిలేష్

రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన ఎమ్మెల్యేల సంఖ్యా బలం(పూర్తి మెజారిటీ) నాలుగో దశ ఎన్నికల కల్లా సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. రెండు ఫేజుల్లో ఇప్పటి వరకు మోత్తం 113 స్థానాలకు ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ప్రధాన పార్టీలు ప్రచారంలో ప్రత్యర్ధి పార్టీల పైన మాటల తూటాలు పేల్చుతున్నాయి. యోగీ ప్రభుత్వ విజయాలను బీజేపీ ప్రధానంగా ప్రచారం చేస్తుండగా... అదే సమయంలో చోటు చేసుకున్న వివాదాలను కాంగ్రెస్..ఎస్పీ ప్రచారాస్త్రాలుగా మలచుకున్నాయి. రెండు విడతల్లో 100కు పైగా సీట్లు కచ్చితంగా గెలుకుంటామని అఖిలేష్ చెప్పుకొచ్చారు.

తండ్రి ప్రచారంలోకి ఎంట్రీతో జోష్

తండ్రి ప్రచారంలోకి ఎంట్రీతో జోష్

సమాజ్‌వాదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కులాల గణాంకాలు సేకరిస్తామని హామీ ఇచ్చారు. ఇవి ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు, బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ అందజేసిన రాజ్యాం గాన్ని కాపాడేందుకు, దళితులు, మైనారిటీలు, వెనుకబడిన వర్గాల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు జరుగుతున్న ఎన్నికలు అని వ్యాఖ్యానించారు. చట్టాన్ని అతిక్రమించేవారు, చట్టప్రకారం నడుచుకోనివారు తమ పార్టీకి ఓటు వేయాల్సిన అవసరం లేదన్నారు. ఇక, తండ్రి ములాయం ప్రచారంలోకి రావటం ఇప్పుడు ఎస్పీ కేడర్ లో జోష్ పెంచుతోంది. అఖిలేశ్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

Recommended Video

Uttar Pradesh Elections 2022: 58 స్థానాలకు పోలింగ్.. బరిలో 623 మంది | Oneindia Telugu
నాలుగో విడతకే పూర్తి మెజార్టీ సాధిస్తామంటూ

నాలుగో విడతకే పూర్తి మెజార్టీ సాధిస్తామంటూ

సమస్యలు పరిష్కారం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని, వారి ఆకాంక్షలను తమ పార్టీ కచ్చితంగా నెరవేరుస్తుందని ములాయం హామీ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో అమెరికా సహా ప్రపంచ దేశాల కళ్లు సమాజ్‌వాదీ పార్టీపైనే ఉన్నాయని చెప్పారు. ప్రచార వేదికపై అఖిలేశ్‌ యాదవ్‌ తన తండ్రి పాదాలకు నమస్కరించి, ఆశీర్వాదాలు పొందారు. కర్హాల్‌లో మూడో దశలో భాగంగా ఈ నెల 20న పోలింగ్‌ జరగనుంది. ఇక్కడ అఖిలేశ్‌పై బీజేపీ అభ్యర్థిగా ఎస్‌.పి.సింగ్‌ బఘేల్‌ పోటీకి దిగుతున్నారు. దీంతో..మూడో విడత పోలింగ్ పార్టీ అభ్యర్ధులతో పాటుగా తన వ్యక్తిగత ప్రతిష్ఠకు అఖిలేష్ కు సవాల్ గా మారుతున్నాయి

English summary
Samajwadi chief Akhilesh confident on winning 100 seats in two phases polling in UP. Akhilesh contsting from Karhal is in third phase polling.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X