కొలిక్కి వచ్చిన సీట్ల పంపకాలు: పోటీ చేసే ఆ స్థానాలు ఇవే
Congress: దేశం.. ఎన్నికల ఏడాదిలో ప్రవేశించింది. రెండు నెలల్లో సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనాల్సి ఉంది. మార్చి రెండో వారంలో లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు ఉన్నాయి. మే చివరి వారం నాటికి కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయంగా కనిపిస్తోంది.
ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మంగా తీసుకుంటోన్నాయి అన్ని పార్టీలు. వరుసగా మూడోసారి అధికారంలోకి రావడానికి భారతీయ జనతా పార్టీ సారథ్యంలో ఎన్డీఏ.. ఈ సారి గద్దెనెక్కడానికి ప్రతిపక్షాల ఉమ్మడి కూటమి ఇండియా సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. దీనికి అనుగుణంగా వ్యూహ, ప్రతివ్యూహాలను రూపొందించుకుంటోన్నాయి.

ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాది పార్టీ- కాంగ్రెస్ మధ్య సీట్ల పంపకాల వ్యవహారం ముగిసింది. ఈ రెండు పార్టీల నాయకుల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. ఈ మేరకు సమాజ్‌వాది పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు నరేష్ ఉత్తమ్ పటేల్, జాతీయ ప్రధాన కార్యదర్శి రాజేంద్ర చౌదరి, ఉత్తరప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు అజయ్ రాయ్, ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ అవినాష్ పాండే.. జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఈ విషయాన్ని ప్రకటించారు.
మొత్తం 80 లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్న అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఇందులో 17 చోట్ల కాంగ్రెస్ పోటీ చేస్తుంది. మిగిలిన 63 స్థానాల్లో తన అభ్యర్థులను నిలబెడుతుంది సమాజ్‌వాది పార్టీ.
కాంగ్రెస్ పోటీ చేసే నియోజకవర్గాల జాబితాలో రాయ్‌బరేలీ, అమేథీ, వారణాశి, ఘజియాబాద్, కాన్పూర్, నగర్, సహరాన్‌పూర్, అమ్రోహ, ఫతేపూర్ సిక్రీ, మహరాజ్‌గంజ్, బన్స్‌గావ్, బులంద్‌షహర్, మథుర, ప్రయాగ్‌రాజ్, దేవరియా, ఝాన్సీ, సీతాపూర్, బారాబాంకీ ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లోని ఖజురహో లోక్‌సభ స్థానంలో సమాజ్‌వాది పార్టీ పోటీ చేస్తుంది. ఇక్కడ ఎస్పీ అభ్యర్థికి కాంగ్రెస్ మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications