బీజేపీలో ఓటమి భయం.. మతాల మధ్య చిచ్చుపెట్టే కాషాయం ఆటలు సాగవు : ఎస్పీ
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోరులో అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రెండో దశ పోలింగ్ ఒకవైపు జరుగుతుంగా.. మరో వైపు బీజేపీపై సమాజ్ వాదీ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. యూపీలో కాషాయ దళానికి ఓటమి భయం పట్టుకుందని ఎదురు దాడికి దిగింది. మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపణలు గుప్పిస్తుంది.

మతాల పరంగా ఓట్లు చీల్చి..
యూపీ ప్రజలను మతాల పరంగా చీల్చి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు కాషాయ పార్టీ ప్రయత్నిస్తోందని సమాజ్ వాదీ పార్టీ ఆరోపిస్తోంది. బీజేపీ చిల్లర రాజకీయాలు ఇక పనిచేయవని హెచ్చరిస్తున్నారు. బీజేపీ నేతలు ఇంకా ఎంతకాలం మత రాజకీయాలు ప్రేరేపిస్తూ పబ్బం గుడుపుకుంటారని ఎస్పీ నేత ఇమ్రాన్ మసూద్ నిలదీశారు. ఈ ఐదేండ్ల బీజేపీ పాలనలో యూపీకి యోగి మేలు చేసి ఉంటే ఇప్పడు మతపరమైన రాజకీయాలు చేసి ఉండేవారు కాదని ఆరోపించారు.

కాషాయంలో కలవరం..
రాష్ట్రంలో హిందూ-ముస్లీంల మధ్య చీలిక తెస్తూ ఎన్నికలకు ముందు కాషాయ పార్టీ మత రాజకీయాలకు పాల్పడుతుందని ఎస్పీ నేతలు ఫైర్ అవుతున్నారు. దేశాన్ని పట్టి పీడిస్తున్న నిరుద్యోగం , రైతాంగ సమస్యలు , ధరల గురించి బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశారు. సమాజ్ వాదీ పార్టీకి ప్రజల నుంచి వస్తున్న ఆదరణను, గెలుపు అవకాశాలను చూసి బీజేపీ నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Recommended Video

పలు చోట్ల ఉద్రిక్తత
రెండో దశ ఎన్నికల పోలింగ్ లో పలు చోట్ల ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. సంభాల్‌లో బీజేపీ అభ్యర్థి వాహనాన్ని ద్వంసం చేయడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ అసెంబ్లీ ఎన్నికలో మరోసారి అధికార పీఠాన్ని దగ్గించుకునేందుకు బీజేపీ సర్వశక్తులూ ఒడ్డుతుంది. అటు యోగి సర్కార్‌పై ఉన్న వ్యతిరేకతను సొమ్ము చేసుకుని అందలం ఎక్కాలని అఖిలేశ్ నేతృత్వంలోని ఎస్పీ తీవ్రంగా కృషి చేస్తోంది.












Click it and Unblock the Notifications