ఇసుక మాఫియా, ప్రభుత్వ ఆఫీసులో వీఆర్వోను నరికేసి ?, సీఎంకు షాక్ ఇచ్చి !
చెన్నై/ తిరునల్వేలి: నీతి నిజాయితీగా పని చెయ్యాలని అనుకున్న ప్రభుత్వ ఉద్యోగిని కొందరు వ్యక్తులు దారుణంగా నరికి చంపేశారు. ఇసుక మాఫియాను అడ్డుకోవడానికి ప్రయత్నించిన వీఆర్వోను ఆయన ఉద్యోగం చేస్తున్న కార్యాలయంలోనే నరికి చంపేయడం కలకలం రేపింది. వీఆర్వో హత్యతో సాటి ప్రభుత్వ ఉద్యోగులు హడలిపోయారు.
తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలోని వీఆర్వోగా ఉద్యోగం చేస్తున్న లూర్ద్ ఫ్రాన్సిస్ అనే వ్యక్తిని ఆయన పని చేస్తున్న కార్యాలయంలోనే హత్య చెయ్యడంతో ఆ ప్రాంత ప్రజలు బిత్తరపోయారు. గ్రామ పరిపాలనా అధికారి (వీఆర్వో)గా ఉద్యోగం చేస్తున్న లూర్ద్ ఫ్రాన్సిస్ హత్యతో ఆ పరిసర ప్రాంతాల్లోని ప్రజలు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
లూర్ద్ ఫ్రాన్సిస్ గత ఏడాదిన్నరగా మోరప్పనాడు గ్రామంలో వీఆర్వో అధికారిగా పనిచేస్తున్నారు. మధ్యాహ్నం 12. 30 గంటల ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు లూర్ద్ ఫ్రాన్సిస్ ఉద్యోగం చేస్తున్న ఆయన కార్యాలయానికి వెళ్లారు. తరువాత ఫ్రాన్సిస్ మీద దాడికి పాల్పడ్డారు. లూర్ద్ ఫ్రాన్సిస్ చేతులు, తల, శరీరం మీద తీవ్ర గాయాలయ్యాయి.

నిజాయితీపరుడు, ధైర్యవంతుడు, ప్రభుత్వ ఆస్తులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా కాపుడుతున్న లూర్ద్ ఫ్రాన్సిస్ హత్యకు గురికావడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది. ఈ ఘటనపై వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి హంతకులను అరెస్టు చెయ్యాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే. స్టాలిన్ తిరునల్వేలి జిల్లా పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
వీఆర్వో లూర్ద్ ఫ్రాన్సిస్ కుటుంబ సభ్యులకు కోటి రూపాయల నష్టపరిహారం ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే. స్టాలిన్ ప్రకటించారు. వీఆర్వో లూర్ద్ ఫ్రాన్సిస్ హత్యను అన్నాడీఎంకే, బీజేపీతో పాటు తమిళనాడులోని పలు పార్టీల నాయకులు ఖండించారు. ఈ కేసులో సంబంధమున్న వారి అరెస్టుకు చర్యలు తీసుకుంటున్నామని తిరునల్వేలి జిల్లా సెంథిల్‌రాజ్ తెలిపారు.












Click it and Unblock the Notifications