ఆసుపత్రిలో స్టార్ హీరో, ఆందోళనలో అభిమానులు, రెండేళ్ల తరువాత ఆ ఫ్యామిలీలో మరో షాక్ !
బెంగళూరు: స్యాండిల్ వుడ్ ప్రముఖ నటుడు శివరాజ్ కుమార్ గత కొన్ని రోజులుగా ఆరోగ్య సమస్యలో బాధపడుతున్నారు. జ్వరం ఎక్కువగా రావడంతో శుక్రవారం బెంగళూరులోని ఆసుపత్రిలో చేరారు. ఆయన అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరి తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారని తెలిసింది. బెంగళూరులోని వైదేహి ఆస్పత్రిలో శివరాజ్ కుమార్ చికిత్స పొందుతున్నారు.పెద్దగా ఇబ్బంది ఏమీ లేదని, ఆయన కోలుకుంటున్నారని కుటుంబ వర్గాలు తెలిపాయి.
శుక్రవారం మధ్యాహ్నం ఆస్పత్రిలో చేరారు, సాయంత్రం జనరల్ చెకప్ పూర్తయ్యింది, విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించడంతో ప్రస్తుతం ఆయన ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్లిపోయినట్లు సమాచారం. 61 ఏళ్ల వయసులో కూడా యువకుడిలా కనిపించే హ్యాట్రిక్ హీరో శివరాజ్ కుమార్ చేతిలో పదుల సంఖ్యలో చిత్రాలు ఉన్నాయి. తమిళం, తెలుగు భాషల్లో వరుసగా ఆఫర్లు వస్తున్నాయి.

శివరాజ్ కుమార్ హీరోగా నటించిన గోస్ట్ సినిమా ఇటీవలే విడుదల అయ్యి సూపర్ హిట్టయింది. ఆయన ఆరోగ్యంగా ఉన్నారని, అభిమానులు భయపడాల్సిన అవసరం లేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈయన ప్రస్తుతం చాలా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. సినిమాలతో పాటు టీవీ షోస్‌లో కూడా శివరాజ్ కుమార్ పాల్గొంటు చాలా బిజీగా ఉన్నారు. ఇటీవల కాలంలో ఈయన ఆరోగ్యంలో తేడా కనిపించిందని ఆయన సన్నిహితులు అంటున్నారు.
కొన్నాళ్ల క్రితం గుండె సంబంధిత సమస్య వచ్చింది. ఆ సందర్భంలో శస్త్రచికిత్స కూడా జరిగింది. బెంగుళూరులోని మాల్యా ఆసుపత్రిలో శస్త్ర చికిత్స చేయించుకుని వైద్యుల సలహా మేరకు కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన జైలర్ సినిమాలో గెస్ట్ రోల్ లో నటించిన శివరాజ్ కుమార్ ఇప్పుడు అనేక కన్నడ సినిమాల్లో నటిస్తున్నారు.
సెంచరీ స్టార్, హ్యాట్రిక్ హీరోగా స్యాండిల్ వుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న శివరాజ్‌కుమార్ ప్రధాన పాత్రలో శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ ఘోస్ట్ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించింది. ప్రస్తుతం ఈయన మఫ్తీ చిత్రంలో నటిస్తున్నారు. నర్తన్ దర్శకత్వం వహిస్తున్న బైరతి రంగల్ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.

శివరాజ్ కుమార్ ఒకదాని తర్వాత ఒకటి అంటూ అనేక సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఆరోగ్యం నిలకడగా ఉందని ఆస్పత్రి వైద్యులు శనివారం తెలిపారు. స్యాండిల్ వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం 2021 అక్టోబర్ 30వ తేదీన గుండెపోటుతో చనిపోయారు. పునీత్ రాజ్ కుమార్ రెండవ వర్దంతి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన అన్న శివరాజ్ కుమార్ ఇప్పుడు అనారోగ్యానికి గురికావడంతో శివన్న అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications