సెంట్రల్ జైలులో తనకు అది కావాలని పట్టుబడుతున్న స్టార్ హీరో, ఆలోచిస్తున్న ఆఫీసర్స్

కర్ణాటకలోని చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో అండర్ ట్రయల్ ఖైదీగా శిక్ష అనుభవిస్తున్న శ్యాండిల్ వుడ్ హీరో దర్శన్ ఇప్పుడు జైల్లో కొత్త డిమాండ్ చేశాడని వెలుగు చూసింది. ప్రస్తుతం బళ్లారి సెంట్రల్ జైలులో ఉన్న దర్శన్ ఇప్పుడు తనకు టీవీ కావాలని జైలు అధికారులకు మనవి చేశారని తెలిసింది. ఇంత కాలం టీవీ వద్దు అని చెప్పిన హీరో దర్శన్ ఇప్పుడు తనకు టీవీ కావాలని డిమాండ్ చేస్తున్నాడని తెలిసింది.

బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు నుండి బళ్లారి సెంట్రల్ జైలుకు వెళ్లిన హీరో దర్శన్ ఇప్పుడు తన సెల్ లో టీవీ కావాలని జైలు సూపరెంటెండెంట్ కు మనవి చేశాడు. రేణుకాస్వామి హత్య కేసులో బెంగళూరు పోలీసులు ఛార్జిషీట్‌ ఎప్పుడు సమర్పిస్తున్నారు అనే విషయమై హీరో దర్శన్‌ బళ్లారి సెంట్రల్ జైలు సిబ్బందిని పలుమార్లు అడిగారని తెలిసింది. ఇప్పుడు హీరో దర్శన్ తనకు టీవీ ఇవ్వాలని ఉన్నతాధికారులకు వినతి పత్రం అందించాడు.ఈ విషయాన్ని జైలు సిబ్బంది ప్రముఖ కన్నడ టీవీ న్యూస్‌ చానెల్ కు తెలిపారు.

Sandlewood hero Darshan is asking the prisons department to get a TV in Bellary Central Jail

హైసెక్యూరిటీ సెల్‌లో ఆహారం పంపిణీ చేస్తుండగా హీరో దర్శన్ అక్కడి సిబ్బందిని టీవీ గురించి అడిగారు. జైలు నిబంధనల ప్రకారం టీవీ ఇవ్వవచ్చని, అందుకే టీవీ అవసరమని హీరో దర్శన్ ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు.ప్రస్తుతం దర్శన్ సెల్‌లో టీవీ లేకపోవడంతో ఇప్పుడు దర్శన్ సెల్‌కు టీవీ ఇచ్చే ఆలోచనలో కర్ణాటక జైళ్ల శాఖ అధికారులు ఉన్నారని తెలిసింది.

గతంలో బెంగళూరు సెంట్రల్ జైలులో తనకు టీవీ వద్దు అని చెప్పిన హీరో దర్శన్ ఇప్పుడు టీవీని డిమాండ్ చేయడానికి కారణం ఉందని సంబంధిత అధికారులు అంటున్నారు. హత్య కేసులో పోలీసు అధికారులు జార్జ్ షీట్‌ను సమర్పించడం గురించి సరైన సమాచారం రాకపోవడంతో దర్శన్ టీవీ అడుగుతున్నాడని తెలిసింది. టీవీ ఉంటే హీరో దర్శన్ అతని మీద దాఖలు చేస్తున్న ఛార్జిషీట్ గురించి మీడియా ద్వారా ఆయన వివరాలు తెలుసుకునే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. ఇప్పటికే మరుగుదొడ్డి సమస్య ఉండడంతో తనకు సరైన బాత్ రూమ్, టాయిలెట్ ఇవ్వాలని హీరో దర్శన్ బళ్లారి సెంట్రల్ జైలు అధికారులను మనవి చేశారని కన్నడ మీడియా అంటోంది

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+