‘బ్లాక్‌మెయిల్‌తో అజిత్‌ పవార్‌ను లొంగదీసుకొన్నారు.. వారి పేర్లను బయటపెడుతాం’

మహారాష్ట్రలో పొలిటికల్ హైడ్రామా ఆసక్తికరంగా కొనసాగుతున్నది. రాష్ట్ర రాజకీయాలపై ఆధిపత్యం కొనసాగించేందుకు అన్ని పార్టీలు చకచకా పావులు కదుపుతున్నాయి. అనూహ్య పరిణామాల మధ్య ఎన్సీపీ చీలిక నేత అజిత్ పవార్ మద్దతుతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా, అజిత్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్ని పార్టీల నేతలు ఒకరిపై మరొకరు విమర్శనాస్త్రాలు సంధించుకొంటున్న నేపథ్యంలో శివసేన నేత, మాజీ కేంద్ర మంత్రి సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

శనివారం ఉదయం మీడియాతో సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. అజిత్ పవార్‌ను కొందరు బ్లాక్ మెయిల్ చేశారు. త్వరలోనే అలాంటి నీచ కార్యక్రమాలకు పాల్పడిన వారి పేర్లను శివసేన అధికారిక పత్రిక సామ్నా బయటపెడుతుందని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా బీజేపీ ప్రభుత్వానికి గుడ్‌బై చెప్పి అజిత్ పవార్ తిరిగి వెనక్కి వస్తారని, ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేకు తిరిగి వచ్చారని పేర్కొనడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.

Sanjay Raut: Ajit Pawar was blackmailed?

శనివారం ఉదయమే ఊహించని విధంగా ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేయడంతో శివసేన, ఎన్సీపీ ఐక్యంగా ఉండేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. తమ ఎమ్మెల్యేలను పార్టీని వీడిపోకుండా చర్యలు తీసుకొంటున్నారు. బీజేపీ తీరుపై శివసేన చీప్ ఉద్దవ్ థాకరే మండిపడ్డారు. మహారాష్ట్రపై బీజేపీ చేసిన సర్జికల్ స్ట్రయిక్ అని వ్యాఖ్యలు చేశారు.

కాగా ఎన్సీపీని వీడిన ఎమ్మెల్యేకు శరద్ పవార్ ఘాటైన హెచ్చరికలు చేశారు. పార్టీ నియమాలకు వ్యతిరేకించే వారిపై సస్పెన్షన్ వేటు వేస్తామని, పార్టీ ఫిరాయింపు చట్టాన్ని ప్రయోగిస్తామని వార్నింగ్ ఇచ్చారు. పార్టీ లెజిస్లేచర్ నేతగా వ్యహరిస్తున్న అజిత్ పవార్‌ స్థానంలో మరొకరిని ఎంపిక చేస్తామని, పార్టీ సమావేశం అనంతరం కీలక ప్రకటన చేస్తానని శరద్ పవర్ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+