శంకరరామన్ హత్య: ఎప్పుడేం జరిగింది
పుదుచ్చేరి: కంచి కామకోటి పీఠంలో ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్న శంకరరామన్ 2004లో హత్యకు గురయ్యారు. ఈ కేసుకు సంబంధించిన తీర్పును బుధవారం పుదుచ్చేరి కోర్టు వెలువరించింది. కంచికామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి, విజయేంద్ర సరస్వతి సహా మొత్తం ఇరవై మూడు మందిని పాండిచ్చేరి కోర్టు నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పును వెలువరించింది.
కాగా హత్య కేసులో తప్పుడు సమాచారం ఇచ్చి కోర్టును పక్కదోవ పట్టించడం, క్రిమనల్ చర్యలను తప్పించుకోవడానికి నిధులను దుర్వినియోగం చేయడం మొదలైన అభియోగాలను దర్యాప్తు బృందం పీఠాధిపతులపై నమోదు చేసింది. అయితే నిందితుల ప్రమేయం పైన దర్యాఫ్తు బృందం సరైన ఆధారాలు చూపించక పోవడంతో వారిని కోర్టు నిర్దోషులుగా కోర్టు ప్రకటించింది.

కేసు మొదటి నుంచి..
2004లో..
సెప్టెంబర్ 3: తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురంలోని వరధరాజస్వామి ఆలయంలో ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్న శంకరరామన్ హత్యకు గురయ్యాడు.
నవంబర్ 11: శంకరరామన్ హత్య కేసుతో సంబంధం ఉందన్న ఆరోపణలతో కంచికామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్థిక వ్యవహారాలలో అవకతవకలతకు పాల్పడినట్లు ఆరోపణలు చేయడంతోనే శంకరరామన్‌ను జయేంద్ర సరస్వతి హత్య చేయించినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.
నవంబర్ 17: అలందూర్ జిల్లా మేజిస్ట్రేట్ ఎదుట హత్య కేసులో నిందితుడు అంబిగపాఠి లొంగిపోయాడు.
నవంబర్ 21: హత్యకు ఉపయోగించిన కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
నవంబర్ 21: పోలీసు కస్టడీలో ఉన్న జయేంద్ర సరస్వతి తన వాదనను పోలీసులకు వినిపించారు. శంకరరామన్ ..సోమశేఖరగనపడిగల్, జయేంద్రర్ పేరుతో రాసిన నాలుగు లేఖలు, టెలిఫోన్ డైరెక్టరీ, సెల్‌ఫోన్ ఛార్జర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
డిసెంబర్ 19: మరో ప్రధాన నిందితుడు అప్పు కృష్ణస్వామిని పోలీసులు అరెస్ట్ చేశారు. రవి సుబ్రహ్మణ్యమ్ అనే వ్యక్తి నుంచి కొంత సొమ్ము తీసుకున్నట్లుగా ఉన్న రిసీట్స్‌ను అతని నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఆ సొమ్ము జయేంద్ర సరస్వతి నుంచి వచ్చినట్లు ఆరోపణలున్నాయి.

డిసెంబర్ 24: హత్యకు సంబంధముందన్న సమాచారంతో శంకర మఠం మేనేజర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టులతో దేశవ్యాప్త నిరసనలు వ్యక్తమయ్యాయి.
2005లో..
జనవరి 10: జయేంద్ర సరస్వతి బెయిల్‌పై విడుదల.
మార్చిలో నిందితులలో ఒకరైన ఎం కథిరావన్ హత్యకు గురయ్యాడు.
నవంబర్ 2005లో పుదుచ్చేరి ప్రిన్సిపల్ కోర్టు 187మంది సాక్షులను విచారించింది.
2013లో..
నవంబర్ 27: ఆధారాలు లేకపోవడంతో నిందితులను కోర్టు నిర్ధోషులుగా ప్రకటించింది.












Click it and Unblock the Notifications