వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాకు ప్రాణహాని, వాతావరణం బాగాలేదు, చెన్నై పంపించండి: శశికళ

అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ అందరూ ఊహించిందే చేశారు. తనకు బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ప్రాణహానీ ఉందని, అంతేకాకుండా తనకు ఇక్కడి వాతావరణం కూడా పడటం లేదని పిటిషన్ వేశారు.

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ అందరూ ఊహించిందే చేశారు. తనకు బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ప్రాణహానీ ఉందని, అంతేకాకుండా తనకు ఇక్కడి వాతావరణం కూడా పడటం లేదని పిటిషన్ వేశారు.

శశికళకు రివర్స్: ప్రాణహానీ లేదని చెప్పిన కర్నాటక ఐబీ, అదే జరిగితే..శశికళకు రివర్స్: ప్రాణహానీ లేదని చెప్పిన కర్నాటక ఐబీ, అదే జరిగితే..

తనను పరప్పన అగ్రహార జైలు నుంచి చెన్నై సెంట్రల్ జైలుకు తరలించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. దానిని అధికారులు పరిశీలిస్తున్నారు. అయితే, ఈ లేఖను పరప్పన అగ్రహార జైలు అధికారులు.. చెన్నై సెంట్రల్ జైలు అధికారులకు పంపించనున్నారు.

పరప్పన అగ్రహార జైలు

పరప్పన అగ్రహార జైలు

ముఖ్యమంత్రి పీఠం పైన కూర్చుందామని భావించిన శశికళకు వరుసగా షాకులు తగులుతున్నాయి. జయ అక్రమాస్తుల కేసులో ఆమె అరెస్టై ప్రస్తుతం.. బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఉన్నారు.

జైలు మారేందుకు ప్రయత్నం

జైలు మారేందుకు ప్రయత్నం

తమిళనాడులో తాను ఎంపిక చేసిన పళనిస్వామిని ముఖ్యమంత్రిగా చేసుకోగలిగారు. ఈ నేపథ్యంలో బెంగళూరులో ఉండటం కంటే.. తమిళనాడులో ఉండటమే బాగుంటుందని శశికళ భావిస్తున్నారు. దీంతో ఆమె చెన్నైలోని సెంట్రల్ జైలు లేదా వేలూరు జైలుకు తరలి వెళ్లాలని భావిస్తున్నారు. ఆమె కుటుంబ సభ్యులు, అన్నాడీఎంకే పార్టీ నేతలు కూడా అదే కోరుకుంటున్నారు.

పిటిషన్

పిటిషన్

పరప్పన అగ్రహార జైలులో ప్రాణహాని ఉందని, వసతులు తనకు బాగా లేవని చెబుతూ ఆమె తాజాగా, సోమవారం నాడు పిటిషన్ దాఖలు చేయడం గమనార్హం. దీనిని అధికారులు పరిశీలిస్తున్నారు.

కర్నాటక తిరస్కరించవచ్చు

కర్నాటక తిరస్కరించవచ్చు

తమిళనాడు ప్రభుత్వం, అన్నాడీఎంకేతో పాటు శశికళ కుటుంబం కూడా ఆమెను తమిళనాడు జైలుకు తరలించాలని చూస్తున్నారు. ఆమె తమిళనాడులో ఉంటే జైలు నుంచి హాయిగా చక్రం తిప్పవచ్చునని భావిస్తున్నారు. అయితే, కర్నాటక మాత్రం అడ్డుకునే ప్రయత్నాలు చేస్తోంది.

English summary
AIADMK chief Sasikala has asked Parappana Agrahara jail officials to shift Chennai Central Jail.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X