వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జైలు నుండే చిన్నమ్మ చక్రం, సైనేడ్ మల్లికతో ముప్పేనా, అన్నాడిఎంకె నేతలిలా..

జైలు నుండే అన్నాడిఎంకె ప్రధాన కార్యదర్శి శశికళ చక్రం తిప్పుతున్నారు. తాను అనుకొన్నట్టుగానే తమిళనాడు రాజకీయాలను ఆమె శాసిస్తున్నారు. తన ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

చెన్నై:జైలు నుండే అన్నాడిఎంకె ప్రధాన కార్యదర్శి శశికళ చక్రం తిప్పుతున్నారు. తాను అనుకొన్నట్టుగానే తమిళనాడు రాజకీయాలను ఆమె జైలు నుండే శాసిస్తున్నారు. తమిళనాడులో ఆమె లేకపోయినా తాను కోరుకొన్నట్టుగానే రాజకీయాలను నడిపిస్తున్నారు.

ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే కేసులో సుప్రీంకోర్టు చిన్నమ్మ శశికళకు నాలుగేళ్ళ పాటు సుప్రీంకోర్టు జైలు శిక్షను విధించింది. ఈ కేసులో శిక్షను అనుభవిస్తున్న చిన్నమ్మ ప్రస్తుతం బెంగుళూరులోని పరప్ఫణ ఆగ్రహర జైలులో ఉంది.

ముఖ్యమంత్రి కావాలని చివరి నిమిషం వరకు ప్రయత్నించిన శశికళ పరిస్థితులు ఎదురు తిరగడంతో పళని స్వామికి ముఖ్యమంత్రి పదవి దక్కేలా వ్యూహరచన చేసింది. తాను అనుకొన్నట్గుగానే ఆమె తమిళనాడులో సాగేలా చేస్తోంది.

తమిళనాడులో తాను లేకపోయినా రాజకీయంగా తన మాటే చెల్లుబటు అయ్యేలా చిన్నమ్మే చక్రం తిప్పుతున్నారు.అసెంబ్లీలో పళని స్వామి బల నిరూపణ చేసుకొన్నారు.

బల పరీక్ష పై ఎప్పటికప్పుడు సమాచారం

బల పరీక్ష పై ఎప్పటికప్పుడు సమాచారం

తమిళనాడు అసెంబ్లీ ముఖ్యమంత్రి పళని స్వామి బలపరీక్ష సందర్భంగా ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఆమె తెలుసుకొన్నారని సమాచారం. అంతే కాదు అన్నాడిఎంకె నాయకులకు ఆమె స్పష్టమైన ఆదేశాలను కూడ జారీ చేశారని పార్టీ వర్గాల్లో ప్రచారంలో ఉంది. అసెంబ్లీలో ఎదురయ్యే పరిస్థితులకు అనుగుణంగా వ్యూహ రచన చేశారు చిన్నమ్మ.ఆమె వ్యూహారచన ప్రకారంగానే అన్నాడిఎంకె నాయకులు వ్యవహరిస్తున్నారు.

శశికళ భద్రతపై అన్నాడిఎంకె నేతల సందేహాలు

శశికళ భద్రతపై అన్నాడిఎంకె నేతల సందేహాలు

శశికళ బుదవారం నాడు జైలుకు వెళ్ళారు. మొదటి రోజు కాస్త ముభావంగా కన్పించిన శశికళ గురువారం నుండి సాధారణంగానే ఉన్నారు. టిఫిన్, భోజనం కోసం అందరితోపాటే క్యూలో నిల్చుంటున్నారు. కాబోయే భర్తను ప్రియుడితో కలిసి చంపిన బెంగుళూరు యువతి శుభా శంకర్ నారాయణ గతంలో ఉన్న సెల్ లోనే శశికళ ఉన్నారు.శశికళ ఉన్న సెల్ పక్కనే సైనేడ్ తో ఏడుగురు మహిళలను చంపి ఆభరణాలను దోచుకెళ్ళిన కేసులో జీవిత ఖైదు అనుభవిస్తోన్న సైనేడ్ మల్లిక ఉంది. దీంతో అన్నాడిఎంకె నాయకులు శశికళ భద్రతపై సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.

ఏ క్లాస్ హోదా కోసం ప్రయత్నాలు

ఏ క్లాస్ హోదా కోసం ప్రయత్నాలు

శశికళ వయస్సు, ఆరోగ్యం దృష్ట్యా ఏ క్లాస్ హోదా ఇవ్వాలని ఆమె తరపు న్యాయవాది కులశేఖర్ కోర్టును కోరుతున్ననారు. ఈ విషయమై సంబందిత పత్రాలను జైళ్ళ శాఖ అధికారులకు అందజేయనున్నారు. ఈ విషయమై తమకు ఎలాంటి అభ్యర్థన రాలేదని పరప్పణ జైలు సూపరింటెండ్ రు.కృష్ణకుమార్ చెప్పారు.

ఏ క్లాస్ హోదా ఉంటే ఏం ప్రయోజనం

ఏ క్లాస్ హోదా ఉంటే ఏం ప్రయోజనం

ఏ క్లాస్ హోదా ఉంటే ప్రత్యేక గది, టీవి, ఫ్యాన్, మంచం, పరుపు వంటి సౌకర్యాలు ఉంటాయి. గదిలోకి దినపత్రికలను తెప్పించుకోవచ్చు. బయటి నుండి ఆహారం కూడ తెప్పించుకోవచ్చు. ఇదిలా ఉంటే భద్రతా కారణాలను చూపుతూ పరప్ఫణ అగ్రహర జైలు నుండి తమిళనాడుకు మార్చే అంశంపై ఆమె లాయర్లు కూడ ప్రణాళికలను రచిస్తున్నారని తెలుస్తోంది. తమిళనాడు సిఎం పళని స్వామి శశికళను కలుసుకొనేందుకు బెంగుళూరుకు వచ్చే అవకాశం ఉందనే ప్రచారం కూడ సాగుతోంది.

English summary
sasikala implements her strategies from jail. sasikala nurtures to political strategies in Tamilnadu.AIADMK leaders suspect about sasikala security in Parappana Agrahara jail.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X