వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శశికళకు ఈసీ మరో షాక్, ప్రశ్నల వర్షం: ఉన్న పదవీ ఊడుతుంది!

అన్నాడీఎంకే అధినేత్రి శశికళకు మరో షాక్ తగిలింది. ఎన్నికల సంఘం ఆమెకు బుధవారం నాడు నోటీసులు జారీ చేసింది. ఆమె పార్టీ పదవి చేపట్టడం పైన పలు ప్రశ్నలు వేసింది.

|
Google Oneindia TeluguNews

చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి శశికళకు మరో షాక్ తగిలింది. ఎన్నికల సంఘం ఆమెకు బుధవారం నాడు నోటీసులు జారీ చేసింది. ఆమె పార్టీ పదవి చేపట్టడం పైన పలు ప్రశ్నలు వేసింది. తాత్కాలిక కార్యదర్శి పదవిని ఎలా చేపడతారని అడిగింది.

శశికళ పదవిని ఎందుకు గుర్తించాలో చెప్పాలని అడిగింది. పార్టీలో అసలు తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పదవి లేదని, అలాంటప్పుడు ఎలా చేపడతారో చెప్పాలని నిలదీసింది. దీంతో, ముఖ్యమంత్రి పదవి కోసం ఎదురు చూసిన శశికళకు ఇప్పుడు ఉన్న పార్టీ చీఫ్ పదవి కూడా పోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

పన్నీరు రె'ఢీ': నేటి వార్తలు మరిన్ని..

ఆమెకు అర్హత లని కారణంగా మధ్యంతర బాధ్యతలు చేపట్టే అవకాశం లేదని ఈసీ తేల్చి చెప్పింది. ఈ విషయమై అన్నాడీఎంకే నుంచి బహిష్కరింపబడిన ఎంపీ శశికళ పుష్ప ఈసీకి ఫిర్యాదు చేశారు.

కాగా, అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పదవి చేపట్టడం పైన శశికళకు నోటీసులు ఇచ్చినట్లు ఈసీ తెలిపింది. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా కోరామని పేర్కొంది. శశికళ పుష్ప ఫిర్యాదు మేరకు నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు.

<strong>శశికళని జయ నమ్మినా.. మోడీ దెబ్బ: సంక్షోభం వెనుక పెద్ద కథే!</strong>శశికళని జయ నమ్మినా.. మోడీ దెబ్బ: సంక్షోభం వెనుక పెద్ద కథే!

పదవి కోల్పోవచ్చు

కాగా, అన్నాడీఎంకేలో తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పదవి లేనందున ఆ పదవి నుంచి కూడా తొలగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆమె గత ఏడాది డిసెంబర్ నెలలో పార్టీ చీఫ్‌గా ఎన్నికయ్యారు. అయితే, పార్టీ రాజ్యాంగంలో ఆ పదవి లేదు.

పార్టీ రాజ్యాంగం ప్రకారం అయిదేళ్ల పాటు వరుసగా పార్టీలో ఉన్న వారు పార్టీ చీఫ్ పదవికి అర్హులు. కానీ ఆమెకు ఆ అర్హత లేదు. కానీ శశికళ కోసం పార్టీ రాజ్యాంగాన్ని మార్చి.. తాత్కాలిక పదవిని కట్టబెట్టారు.

Sasikala set to lose top post in AIADMK: EC sources

తాత్కాలిక జనరల్ సెక్రటరీ పదవి లేదు,

ఇప్పటికే ఆమెకు పన్నీరు సెల్వం నుంచి మొదలు ప్రతిపక్షం వరకు చిక్కుల్లో పడ్డారు. ఆమెను పార్టీ అధినేత్రిగా.. శాసన సభా పక్ష నాయకురాలిగా పార్టీలో చాలామంది వ్యతిరేకిస్తున్నారు. ఆమె పైన సీనియర్ నేతలు దుమ్మెత్తి పోస్తున్నారు.

పన్నీరు సెల్వం బుధవారం నాడు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మరీ శశికళ పైన తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. పార్టీకి తాను ఎప్పుడు నిబద్దతతో పని చేశానని, తన పైన తప్పుడు ప్రచారం చేశారని, బలవంతంగా రాజీనామా చేయించారని, రాజీనామాను వెనక్కి తీసుకుంటానని వ్యాఖ్యానించారు.

అమ్మ మృతి పైన చాలామందిలాగే పన్నీరు సెల్వం కూడా అనుమానాలు వ్యక్తం చేయడం గమనార్హం. ఇక, ప్రతిపక్ష డీఎంకే ఆమెను మొదటి నుంచి టార్గెట్ చేస్తోంది. మరోవైపు దీపా జయకుమార్, శశికళ పుష్పలు విమర్శలు చేస్తున్నారు.

English summary
The Election Commission is likely to revoke the interim general secretary post held by Sasikala. She was elected as the interim general secretary of the AIADMK by the party in December. However the ECI is likely to revoke this post as there is no such provision in the party's constitution.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X