• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

SAvZIM: దక్షిణాఫ్రికాను దురదృష్టం వెంటాడుతోందా? విజయానికి 13 పరుగుల దూరంలో జింబాబ్వేతో మ్యాచ్ ఎందుకు ఆగిపోయింది?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
దక్షిణాఫ్రికా ప్లేయర్ క్వింటన్ డి కాక్

'అయ్యో పాపం'

నిన్న దక్షిణాఫ్రికా-జింబాబ్వే క్రికెట్ మ్యాచ్ చూసిన వారిలో చాలా మంది అంటున్న మాట. వాన వల్ల దక్షిణాఫ్రికా మ్యాచ్‌ను గెలవలేక పోయింది.

దాంతో చాలా మంది ఆ టీమ్‌కు సానుభూతి తెలుపుతున్నారు. అంతే కాదు దక్షిణాఫ్రికా గెలవలేక పోవడానికి కారణమైన డక్‌వర్త్ లూయిస్ నిబంధనలపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

దక్షిణాఫ్రికా, జింబాబ్వే ప్లేయర్స్

అసలు ఏం జరిగింది?

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా దక్షిణాఫ్రికా-జింబాబ్వే మ్యాచ్ జరిగింది. ముందు నుంచే ఈ మ్యాచ్‌కు వాన అంతరాయం కలిగిస్తూ వచ్చింది. అందువల్ల 20 ఓవర్ల మ్యాచ్‌ను 9 ఓవర్లకు కుదించారు.

టాస్ గెలిచిన జింబాబ్వే బ్యాటింగ్ ఎంచుకుంది. 9 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 79 పరుగులు చేసింది. 19 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన తరుణంలో వెస్లీ(35), మిల్టన్(18) నిలబడటంతో జింబాబ్వే ఆ పరుగులు చేయగలిగింది.

వాన వల్ల దక్షిణాఫ్రికా లక్ష్యాన్ని 7 ఓవర్లలో 64 పరుగులకు కుదించారు.

ఓపెన్ క్వింటన్ డి కాక్ తొలి నుంచే దూకుడుగా ఆడాడు. 18 బంతుల్లో 47 రన్స్ కొట్టాడు. తొలి ఓవర్‌లోనే నాలుగు ఫోర్లు, ఒక సిక్స్ కొట్టాడు డి కాక్. మొత్తం మీద ఆ ఓవర్లలో 23 పరుగులు వచ్చాయి.

రెండో ఓవర్‌లోనూ డి కాక్ నాలుగు ఫోర్లు కొట్టాడు.

మొత్తం మీద మూడు ఓవర్లు ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా 51 పరుగులు చేసింది. ఇంకా నాలుగు ఓవర్లు మిగిలే ఉన్నాయి. విజయానికి కావాల్సిన పరుగులు 13 మాత్రమే.

అంతకు ముందు వాన పడుతున్నప్పటికీ అంపైర్లు దక్షిణాఫ్రికాను బ్యాటింగ్ చేయనిచ్చారు. అయితే గ్రౌండ్‌లోని తడి వల్ల జింబాబ్వే ప్లేయర్స్ జారి పడటం మొదలైంది.

జారి పడటంతో జింబాబ్వే బౌలర్ రిచర్డ్ తొడకు గాయమైంది. వాళ్ల వికెట్ కీపర్ రెగిస్ కూడా కింద పడ్డాడు.

దీంతో జింబాబ్వే ప్లేయర్స్ నిరసన వ్యక్తం చేయడంతో అంపైర్లు మ్యాచ్‌ను నిలిపి వేశారు.

దక్షిణాఫ్రికా, జింబాబ్వేలకు చెరో పాయింట్ ఇచ్చారు.

జారి కిందపడిన జింబాబ్వే బౌలర్ రిచర్డ్

దక్షిణాఫ్రికా ఎందుకు గెలవలేక పోయింది?

సాధారణంగా వాన పడి అంతరాయం కలిగితే మ్యాచ్ ఫలితాన్ని డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం నిర్ణయిస్తుంటారు. కానీ ఈ సారి అలా జరగలేదు.

టీ20లలో డక్‌వర్త్ లూయిస్ పద్ధతి వర్తించాలంటే రెండు జట్లు కనీసం చెరో 5 ఓవర్లు ఆడి ఉండాలి.

దక్షిణాఫ్రికా-జింబాబ్వే మ్యాచ్ విషయంలో దక్షిణాఫ్రికా మూడు ఓవర్లు మాత్రమే ఆడింది. అందువల్ల డక్‌వర్త్ లూయిస్ పద్ధతి వర్తించలేదు.

ఫలితంగా రెండు జట్లకు చెరో పాయింట్ ఇచ్చారు.

https://twitter.com/cricketaakash/status/1584520628266143746

సోషల్ మీడియాలో సానుభూతి వెల్లువ

విజయానికి కాస్త దూరంలో ఆగిపోయిన దక్షిణాఫ్రికా జట్టు మీద నెటిజన్లు సానుభూతి చూపిస్తున్నారు.

దక్షిణాఫ్రికాను వాన రూపంలో దురదృష్టం ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుందని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.

'నేను న్యూట్రల్ అయినప్పటికీ దక్షిణాఫ్రికాను చూస్తుంటే బాధేస్తోంది. 7 ఓవర్ల ఆటకు 5 ఓవర్లను కటాఫ్‌గా ఉంచడం ఏంటి?' అంటూ మరొక యూజర్ ప్రశ్నించారు.

https://twitter.com/udit_buch/status/1584518704737710080

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) టోర్నమెంట్స్‌లో దక్షిణాఫ్రికాకు వాన వల్ల ఎప్పుడూ నష్టం జరుగుతోందని కొందరు కామెంట్ చేస్తున్నారు.

'దక్షిణాఫ్రికా, వాన, ఐసీసీ టోర్నమెంట్స్... ఇవి ఎప్పటికీ మంచి ఫ్రెండ్స్ కావు' అని ఒకరు ట్వీట్ చేశారు.

https://twitter.com/CricCrazyJohns/status/1584518927996321792

మరికొందరు కాస్త ఫన్నీ పోస్టులు పెడుతున్నారు.

'మీరు దక్షిణాఫ్రికా మ్యాచ్‌ను సహారా ఎడారిలో సైతం నిర్వహించండి, అక్కడకు కూడా వాన ఎలాగోలా వచ్చి మ్యాచ్‌ను నాశనం చేస్తుంది' అంటూ ఒక ట్విటర్ యూజర్ పోస్ట్ చేశారు.

'ప్రధాని మోదీజీ, దేశం మొత్తం మీద కరువును పారదోలేందుకు నాదొక అభ్యర్థన. కరువు ప్రాంతాల్లో ఐసీసీ టోర్నమెంట్ నిర్వహించండి. అందులో దక్షిణాఫ్రికా ఆడేలా చూడండి. 1000% కచ్చితంగా వానపడుతుంది' అంటూ పృథ్వి అనే యూజర్ కామెంట్ చేశారు.

https://twitter.com/Puneite_/status/1584518694335832064

'దక్షిణాఫ్రికా, వాన, వరల్డ్‌కప్‌ల జోడీని ముందుగానే స్వర్గంలో నిర్ణయించారు' అంటూ మరొక ట్వీట్ చేశారు.

https://twitter.com/AMP86793444/status/1584523032437325824

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
SAvZIM: Bad luck haunting South Africa? Why was the match stopped with Zimbabwe 13 runs away from victory?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X