కనీస బ్యాలెన్స్ లేకుంటే ఛార్జీలు తప్పవు: జన్‌ధన్ కోసమేనట!

పొదుపు(సేవింగ్) ఖాతాల్లో కనీస నిల్వ లేకపోతే పెనాల్టీ ఛార్జీలు తప్పవని ఎస్‌బీఐ ఛైర్‌పర్సన్‌ అరుంధతీ భట్టాచార్య స్పష్టం చేశారు. నగదు నిల్వ అవసరం లేని జన్‌ధన్‌ ఖాతాల నిర్వహణ భారం తగ్గించుకునేందుకే .

ముంబై: పొదుపు(సేవింగ్) ఖాతాల్లో కనీస నిల్వ లేకపోతే పెనాల్టీ ఛార్జీలు తప్పవని ఎస్‌బీఐ ఛైర్‌పర్సన్‌ అరుంధతీ భట్టాచార్య స్పష్టం చేశారు. నగదు నిల్వ అవసరం లేని జన్‌ధన్‌ ఖాతాల నిర్వహణ భారం తగ్గించుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. ఇటువంటి ఖాతాలు ఎస్‌బీఐలో 11కోట్లు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు.

నగదు నిల్వ తగినంత లేనప్పటికీ జన్‌ధన్‌ ఖాతాలకు మాత్రం జరిమానా వర్తించదని స్పష్టంచేశారు. ఖాతాల్లో తగినంత నగదు నిల్వ లేకపోతే జరిమానా విధించే పాత పద్ధతిని మళ్లీ ఏప్రిల్‌ 1 నుంచి అమలు చేస్తామని ఇటీవల ఆ బ్యాంక్‌ ప్రకటించిన నేపథ్యంలో విమర్శలు రావడంతో ఆమె పైవిధంగా స్పందించారు.

SBI chief says new bank charges will help Jan Dhan costs

అయితే, నగదు నిల్వ తగినంత లేని ఖాతాలపై జరిమానా విధించాలన్న నిర్ణయంపై మరోసారి ఆలోచించాలని ప్రభుత్వం సూచన చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటి వరకు తమకు ఎలాంటి సమాచారం లేదని ఎస్‌బీఐ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (జాతీయ బ్యాంకింగ్‌) రజనీశ్‌ కుమార్‌ పేర్కొన్నారు.

ఒకవేళ ప్రభుత్వం కోరితే దానిపై యోచిస్తామని పేర్కొన్నారు. కాగా, ఇప్పటికే ప్రైవేటు బ్యాంకులైన హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంకులు బాదుడు మొదలుపెడ్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+