బీజేపీ ఓబీసీల శత్రువు-యూపీలో మరింత మంది పార్టీని వీడే ఛాన్స్-ఎస్బీఎస్పీ నేత రాజ్ భర్
ఉత్తర్ ప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీని ఇద్దరు మంత్రులతో పాటు పలువురు ఎమ్మెల్యేలు వీడిపోవడం చర్చనీయాంశమవుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ తీరుపై ఇతర పార్టీలు విమర్శలకు దిగుతున్నాయి. ఇదే క్రమంలో బీజేపీకి మాజీ మిత్రపక్షమైన సుహేల్ దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (ఎస్బీఎస్పీ) నేత ఓపీ రాజ్ భర్ బీజేపీపై విరుచుకుపడ్డారు.
బీజేపీ ఓబీసీల శత్రువని ఎస్బీఎస్పీ నేత ఓపీ రాజ్ భర్ అభివర్ణించారు. బీజేపీని ఆ పార్టీకి చెందిన ఓబీసీ మంత్రులు, ఎమ్మెల్యేు వీడిపోవనడంపై స్పందిస్తూ రాబోయే రోజుల్లో మరింత మంది ఆ పార్టీని వీడే అవకాశం ఉందన్నారు. గతంలో బీజేపీతో మిత్రపక్షంగా ఉండి, తాజాగా ఎస్పీతో జట్టు కట్టిన రాజ్ భర్.. ఇప్పుడు బీజేపీలో ఉన్న ఓబీసీ నేతల్ని తమవైపు తిప్పుకోవడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే బీజేపీని వీడిని ఓబీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఓ టీజర్ మాత్రమేనని, కాషాయ పార్టీ ఓబీసీల బలాన్ని కాపాడుకోవడం ఎన్నికల ముందు సవాల్ గా మారనుందని వ్యాఖ్యానించారు.

రెండేళ్ల క్రితం యోగీ కేబినెట్ నుంచి మంత్రిగా తప్పుకున్న రాజ్ భర్... అనంతరం తన పార్టీతో కలిసి బీజేపీకి గుడ్ బై చెప్పారు. ఇప్పుడు ఓబీసీల బలం ఉన్న ఎస్పీతో ఆయన జట్టు కట్టారు. అదే కోవలో బీజేపీలో ఇతర ఓబీసీ నేతలు కూడా తమవైపు వస్తారని ఆయన ఆశాభావంగా ఉన్నారు. ఆయన ఊహించినట్లుగానే బీజేపీకి తాజాగా బీసీ మంత్రులు స్వామి ప్రసాద్ మౌర్య, దారా సింగ్ చౌహాన్ గుడ్ బై చెప్పారు. వీరితో పాటు ఆరుగురు ఎమ్మెల్యేలను కూడా తీసుకెళ్లారు. దీంతో బీజేపీకి భారీ ఎదురు దెబ్బ తగిలినట్లయింది. యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీకి ఈ వ్యవహారం చుక్కలు చూపిస్తోంది.












Click it and Unblock the Notifications