వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ సర్కార్ ప్రిస్టేజియస్ ప్రాజెక్ట్‌: ఢిల్లీ హైకోర్టుకు కీలక ఆదేశాలు ఇచ్చిన సుప్రీం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ప్రాణాంతక కరోనా వైరస్ తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతోంది. సంపూర్ణ లాక్‌డౌన్ విధించినప్పటికీ.. రోజువారీ కేసుల్లో ఆశించిన స్థాయిలో తగ్గుదల కనిపించట్లేదు. వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని దేశ రాజధానిలో ప్రతిష్ఠాత్మకంగా రూపుదిద్దుకుంటోన్న సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ నిర్మాణ పనులన్నింటినీ నిలిపి వేయాలంటూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటీషన్‌.. దేశ అత్యున్నత న్యాయస్థానం ముందుకు విచారణకు వచ్చింది. సుప్రీంకోర్టు ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన బెంచ్.. ఈ పిటీషన్‌పై విచారణ చేపట్టంది. వాదోపవాదాలను ఆలకించింది.

సెంట్రల్ విస్టా నిర్మాణంలో 150 కార్మికులు

సెంట్రల్ విస్టా నిర్మాణంలో 150 కార్మికులు

సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ నిర్మాణ పనులన్నింటినీ నిలిపివేయాలంటూ అన్యా మల్హోత్రా, సొహైల్ హష్మీ ఈ పిటీషన్‌ను దాఖలు చేశారు. సీనియర్ అడ్వొకేట్ సిద్ధార్థ లూథ్రా పిటీషన్ల తరఫున తన వాదనలను వినిపించారు. తాము ఈ ప్రాజెక్ట్‌ను వ్యతిరేకించట్లేదని, నిర్మాణ పనులను కొద్దిరోజుల పాటు మాత్రమే వాయిదా వేయాలని కోరుతున్నామని లూథ్రా వాదించారు. 150 మంది కార్మికులు సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ నిర్మాణ పనుల్లో పాలుపంచుకుంటున్నారని, వారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకోవాలనేది తమ అభిమతమని చెప్పారు. రోజూ వారిని ప్రత్యేక బస్సులో సరాయ్ కాలేఖాన్ ప్రాంతం నుంచి నిర్మాణ ప్రదేశానికి తరలిస్తున్నారని గుర్తు చేశారు.

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా..

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా..

తొలుత పిటీషనర్లు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ.. తన పరిధిలోని అన్ని నిర్మాణ ఫనులను రద్దు చేసిందని గుర్తు చేశారు. ఈ రద్దు ఆదేశాలు సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్‌కు కూడా వర్తిస్తాయని వాదించారు. కరోనా వైరస్ కేసులు వేలల్లో పుట్టుకొస్తోన్న నేపథ్యంలో- దీని నిర్మాణంలో పనిచేస్తోన్న కార్మికులకు ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. వారందరూ కరోనా వైరస్‌కు గురి కావడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఈ పిటీషన్‌ను ఢిల్లీ హైకోర్టు విచారణకు స్వీకరించింది. అనంతరం దాన్ని ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసింది. 10వ తేదీ నాడు విచారణ చేపట్టాలని పిటీషనర్ల తరఫు న్యాయవాది చేసిన విజ్ఞప్తిని ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తులు పరిగణనలోకి తీసుకోలేదు.

సుప్రీంకోర్టులో పిటీషన్..

సుప్రీంకోర్టులో పిటీషన్..


ఈ విచారణను ఢిల్లీ హైకోర్టు 17వ తేదీకి వాయిదా వేయడం పట్ల పిటీషనర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఢిల్లీ హైకోర్టు తీసుకున్న నిర్ణయంపై సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. దీనిపై విచరణ సాగింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సారథ్యంలోని బెంచ్ దీన్ని విచారణకు స్వీకరించింది. ఈ అంశం ఇప్పటికే ఢిల్లీ హైకో్ర్టులో వద్ద విచారణలో ఉందని, ఆ స్థితిలో ఉన్న పిటీషన్‌ను విచారణకు అనుమతి ఇవ్వడం సరికాదని ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. దీనికి సిద్ధార్థ లూథ్రా బదులిస్తూ- ఈ పిటీషన్‌పై విచారణనను ఢిల్లీ హైకోర్టు నెల 17వ తేదీకి వాయిదా వేసిందని, హియరింగ్‌కు రావడానికి చాలా సమయం ఉందని, అది అవాంఛనీయమని అన్నారు. 10వ తేదీన విచారణ చేపట్టాలంటూ తాము చేసిన విజ్ఞప్తిని ఢిల్లీ హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదని చెప్పారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టు అత్యవసర సర్వీసుల పరిధిలోకి రాదని తెలిపారు.

సానుకూలంగా బెంచ్..

సానుకూలంగా బెంచ్..

సిద్ధార్థ లూథ్రా వాదనలపై ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్ సానుకూలంగా స్పందించింది. లూథ్రా తరఫున దాఖలైన పిటీషన్‌పై విచారణ త్వరగా చేపట్టాలని ఆదేశించింది. పిటీషనర్ల కోరిక మేరకు 10వ తేదీ నాడే సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించిన విచారణను చేపట్టాలని సూచించింది. ఈ మేరకు జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ దినేష్ మహేశ్వరితో కూడిన బెంచ్.. ఢిల్లీ హైకోర్టుకు ఆదేశాలను జారీ చేసింది. సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్‌ను మోడీ సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఈ భవన సముదాయంలోకి తీసుకుని రావాలనేది దీని ఉద్దేశం. పార్లమెంట్, రాష్ట్రపతి భవన్, ఇండియా గేట్, నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్ తరహాలో చరిత్రలో శాశ్వతంగా నిలిచి ఉండేలా కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్‌ను డిజైన్ చేసింది. కరోనా సంక్షోభ పరిస్థితుల్లోనూ దాని నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.

English summary
Supreme Court on Friday permitted the petitioners challenging the construction activities of the Central Vista project amid the COVID19 second wave to make a request before the Delhi High Court for an early listing of the case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X