Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

డాక్టర్లు అంటే ఫుట్‌‌బాల్ అనుకుంటున్నారా?: ఎందుకీ ఉరుకులాట?: కేంద్రంపై సుప్రీం నిప్పులు

న్యూఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి కేంద్ర ప్రభుత్వంపై విరుచుకు పడింది. ఘాటు వ్యాఖ్యలు చేసింది. కొద్దిరోజుల కిందటే- కరోనా వైరస్ వ్యాక్సిన్ విషయంలో ఒకటే ధరను ఎందుకు అమలు చేయకపోవడం, వివిధ ట్రిబ్యునల్స్‌కు ఛైర్మన్లు, సభ్యులను నియమించకపోవడంపై కేంద్రాన్ని నిలదీసింది సుప్రీంకోర్టు. ఇప్పుడు మళ్లీ అదే తరహాలో కీలక వ్యాఖ్యలు చేసింది. తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. వచ్చేనెల 4వ తేదీలోగా ఓ సమగ్ర నివేదికను సమర్పించాలనీ ఆదేశించింది.

నీట్ ఎస్ఎస్ పరీక్షలు 2021 మార్పులపై

నీట్ ఎస్ఎస్ పరీక్షలు 2021 మార్పులపై

దీనికి ప్రధాన కారణం- నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ సూపర్ స్పెషాలిటీ 2021 పరీక్షల ప్యాటర్న్‌లో చివరి నిమిషంలో చేయడమే. ఈ పరీక్షల్లో కేంద్ర ప్రభుత్వం చేసిన మార్పులను సవాల్ చేస్తూ 41 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టర్లు సుప్రీంకోర్టులో పిటీషన్లను దాఖలు చేశారు. దీన్ని విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు- కేంద్రంపై ఆగ్రహావేశాలను వ్యక్తం చేసింది. అక్టోబర్ 4వ తేదీ లోగా ఓ సమగ్ర నివేదికను అందజేయాలని సూచించింది.

ఏమిటా మార్పులు..

ఏమిటా మార్పులు..

2018లో నీట్ పీజీ సూపర్ స్పెషాలిటీ పరీక్షల్లో జనరల్ మెడిసిన్స్ అభ్యర్థులకు అనుకూలంగా మార్పులు చేసింది. ఈ ప్రవేశ పరీక్షల ప్రశ్నాపత్రాల్లో జనరల్ మెడిసిన్‌పై 40, సూపర్ స్పెషాలిటీకి సంబంధించిన 60 ప్రశ్నలను పొందుపరిచింది. ఈ దఫా మాత్రం ప్రశ్నలన్నింటినీ కూడా జనరల్ మెడిసిన్‌కు అనుకూలంగా రూపొందించింది. ఈ ఏడాది జులై 23వ తేదీన పరీక్షల ప్యాట్రన్‌లో మార్పులు చేసింది. దీన్ని కిందటి నెల అంటే ఆగస్టు 31వ తేదీన బహిర్గతం చేసింది. నవంబర్ 13, 14వ తేదీల్లో నీట్ పీజీ సూపర్ స్పెషాలిటీ పరీక్షలను రాయాల్సి ఉండగా.. నెలన్నర రోజుల వ్యవధి ముందు మాత్రమే ఈ కొత్త ప్యాట్రన్‌ను ప్రకటించింది కేంద్రం.

సుప్రీంలో సవాల్..

సుప్రీంలో సవాల్..

దీన్ని సవాల్ చేస్తూ 41 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్ అభ్యర్థులు సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. వారి తరఫున సీనియర్ అడ్వొకేట్ జావెద్ ఉర్ రెహ్మాన్ పిటీషన్ వేశారు. 2018లో నీట్ పీజీ సూపర్ స్పెషాలిటీ పరీక్షల్లో చేసిన ప్యాట్రన్‌ అంటే- సూపర్ స్పెషాలిటీకి సంబంధించిన 60 శాతం మార్కులు, జనరల్ మెడిసిన్‌కు సంబంధించిన 40 శాతం మార్కులకు అనుగుణంగా ఈ ఏడాది నవంబర్ 13, 14వ తేదీల్లో జరిగే పరీక్షలకు సన్నద్ధమౌతున్నారు.

నెలన్నర వ్యవధిలో కొత్త ప్యాట్రన్‌కు ఎలా సన్నద్ధం..

నెలన్నర వ్యవధిలో కొత్త ప్యాట్రన్‌కు ఎలా సన్నద్ధం..

దీనికి భిన్నంగా మొత్తం ప్యాట్రన్ మొత్తాన్నీ జనరల్ మెడిసిన్‌కు అనుగుణంగా మార్చుతున్నట్లు ఆగస్టు 31వ తేదీన ప్రకటించడాన్ని తప్పు పడుతున్నారు. ఈ నెలన్నర వ్యవధిలో కొత్త ప్యాట్రన్‌కు అనుగుణంగా ఎలా పరీక్షలకు సన్నద్ధం కావాల్సి ఉంటుందనేది నీట్ పీజీ సూపర్ స్పెషాలిటీ అభ్యర్థుల వాదన. వార దాఖలు చేసిన పిటీషన్‌పై ఇవ్వాళ న్యాయమూర్తులు జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ బీవీ నాగరత్న విచారణ చేపట్టారు.

ఇంత హడావుడీ ఎందుకు..?

ఇంత హడావుడీ ఎందుకు..?

నవంబర్‌లో పరీక్షలను నిర్వహించాల్సి ఉండగా.. ఆగస్టు 31వ తేదీన ఈ ప్యాట్రన్‌ మొత్తాన్నీ ఎందుకు మార్చారని న్యాయమూర్తులు ప్రశ్నించారు. చివరి నిమిషంలో మార్పులు చేయడాన్ని ఏ మాత్రం సమర్థించలేమని అన్నారు. డాక్టర్లను ఫుట్‌బాల్‌గా భావించవద్దని, వారిని బ్యూరోక్రాట్ల దయాదాక్షిణ్యాల మీద వదిలి వేయడం సరికాదని చెప్పారు. అధికార యంత్రాంగాన్ని అదుపులో పెట్టుకోవాలని, దాన్ని ఏ రకంగా కూడా దుర్వినియోగం చేయడం సరికాదని అన్నారు.

Recommended Video

    సాగర్ లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల నిమజ్జానానికి సుప్రీంకోర్ట్ గ్రీన్ సిగ్నల్| Oneindia Telugu
    అభ్యర్థుల కేరీర్‌కు కీలకం..

    అభ్యర్థుల కేరీర్‌కు కీలకం..


    నీట్ పీజీ సూపర్ స్పెషాలిటీ పరీక్షలు.. డాక్టర్ల కేరీర్‌కు ఎంతో ముఖ్యమైనవని, ఇలా చివరి నిమిషంలో మార్పులను చేయడం ద్వారా వారి కేరీర్‌తో ఆటలాడుకోలేరని వ్యాఖ్యానించారు. ఇలాంటి కీలక మార్పులు జరుగుతుంటే నేషనల్ మెడికల్ కమిషన్ ఏం చేస్తోందని న్యాయమూర్తులు ప్రశ్నించారు. ఈ విషయంలో డాక్టర్ల జీవితాలు ముడిపడి ఉన్నాయనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి గుర్తు చేయాలని సూచించారు. ఎన్నో నెలలుగా అభ్యర్థులు సూపర్ స్పెషాలిటీ కోర్సు పరీక్షల కోసం సన్నద్ధమౌతున్నారని, చివరి నిమిషంలో మార్పులు చేయడం ద్వారా సరికాదని అన్నారు. డాక్టర్లతో సున్నితంగా వ్యవహరించాలని చెప్పారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+