వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీజేఐ రమణ బెంచ్ సంచలన ఆదేశాలు -ఢిల్లీ ఆస్పత్రికి సిద్ధిక్‌ కప్పన్‌ -యోగి సర్కారుకు షాక్ -అసాధారణ వాదనలు

|
Google Oneindia TeluguNews

హాత్రస్ దళిత యువతి హత్యాచార ఘటనను కవర్ చేసేందుకు ఉత్తరప్రదేశ్ వెళ్లి, చట్టవిరుద్ధ కార్యకలాపాలు (నివారణ) చట్టం (UAPA) కింద అరెస్టయి, సుదీర్ఘకాలంగా జైలులో మగ్గిపోతోన్న కేరళ జర్నలిస్టు సిద్దిక్ కప్పన్ ఆరోగ్య పరిస్థితి, బెయిల్ అవకాశాలకు సంబంధించి సర్వోన్నత న్యాయస్థానం సంచలన ఆదేశాలిచ్చింది. జర్నలిస్టు సిద్దిక్ కప్పన్ కు టెర్రరిస్టులతో సంబంధాలున్నాయని, కరోనా వైరస్ సోకకున్నా కులం, మతాన్ని అడ్డం పెట్టుకుని లబ్దిపొందాలనుకుంటున్నాడంటూ యూపీ సర్కారు చేసిన వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. నిందితుడికి మెరుగైన చికిత్సకు ఆదేశాలాలతోపాటు కిందికోర్టుల్లో బెయిల్ వినతులపైనా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వివరాల్లోకి వెళితే..

పశువులా కట్టేశారు: సీజేఐ రమణ బెంచ్ కీలక ఉత్తర్వులు -సిద్ధిక్‌ కప్పన్‌ భార్య పిటిషన్‌పై విచారణ -ఉత్కంఠపశువులా కట్టేశారు: సీజేఐ రమణ బెంచ్ కీలక ఉత్తర్వులు -సిద్ధిక్‌ కప్పన్‌ భార్య పిటిషన్‌పై విచారణ -ఉత్కంఠ

ఢిల్లీ ఆస్పత్రికి తరలించండి..

ఢిల్లీ ఆస్పత్రికి తరలించండి..


కొవిడ్ తో బాధపడుతోన్న కప్పన్ ను మథుర మెడికల్‌ కాలేజ్‌ ఆసుపత్రిలో ఒక మంచంపై జంతువును కట్టేసినట్లు కట్టేశారని, కనీసం టాయిలెట్ కు కూడా వెళ్లనీయకుండా ప్లాస్టిక్ డబ్బాలోనే మూత్రం పోయిస్తున్నారని, సరైన ఆహారం కూడా లేదని ఆరోపిస్తూ కేరళ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సిద్దికి కప్పన్ కు చైన్లు తొలగించి, సరైన వైద్యం అందించకుంటే అకాల మరణానికి దారితీసే అవకాశాలున్నాని, ఈ మేరకు త్వరితగతిన ఆదేశాలివ్వాలని యూనియన్ పిటిషన్ వేసింది. ఇవే అంశాలను ప్రస్తావిస్తూ సిద్దిక్ భార్య రైహంత్‌ కప్పన్‌ కూడా సీజేఐకి లేఖ రాశారు. వీటిపై సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలో జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఏఎస్ బోపన్నలతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. సిద్దిక్ కప్పన్ ఎలాంటి కేసుల్లో నిందితుడైనప్పటికీ అనారోగ్యానికి చికిత్సను కాదనలేమని, మెరుగైన ట్రీట్మెంట్ కోసం అతణ్ని మథుర నుంచి ఢిల్లీలోని ఏదో ఒక ప్రభుత్వాసుపత్రికి తరలించాలని యూపీ సర్కారును సుప్రీంకోర్టు ఆదేశించింది.

జగన్ బెయిల్ రద్దు: సీఎం, సీబీఐకి భారీ షాక్ -ఎంపీ రఘురామ పిటిషన్‌ను స్వీకరించిన కోర్టు -నోటీసులుజగన్ బెయిల్ రద్దు: సీఎం, సీబీఐకి భారీ షాక్ -ఎంపీ రఘురామ పిటిషన్‌ను స్వీకరించిన కోర్టు -నోటీసులు

బెడ్లు లేవు.. కోర్టు ఖాళీ చేయిస్తుందా?

బెడ్లు లేవు.. కోర్టు ఖాళీ చేయిస్తుందా?

కేరళ జర్నలిస్ట్ సిద్దిక్ కప్పన్ ఆరోగ్య పరిస్థితిపై విచారణలో యూపీ ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్(ఎస్‌జీ) తుషార్ మెహతా వాదనలు వినిపించారు. కరడుగట్టిన ఉగ్ర సంస్థలకు అనుబంధంగా పనిచేస్తూ, వారి నుంచి ఆర్థిక ప్రయోజనాలకు పొందుతోన్న సిద్దిక్ కప్పన్ కు అసలు కరోనాయే సోకలేదని, మథుర ఆస్పత్రిలో వైద్యులకు అతను సహకరించలేదని, బుధవారం ఉదయమే అతణ్ని ఆస్పత్రి నుంచి జైలుకు తరలించామని, కులం, మతాన్ని అడ్డంపెట్టుకుని బెయిల్ పొందేందుకు చేస్తోన్న ప్రయత్నాలు చేస్తున్నాడని, హెబియస్ కార్పస్ పిటిషన్ పెండింగ్ లో ఉండగా మధ్యలో హెల్త్ కేర్ కోసం వేసిన పిటిషన్లను కోర్టు వారు పరిశీలించరాదని మెహతా అన్నారు. ఒకవేళ అతణ్ని ఢిల్లీ ఆస్పత్రికి తరలించాలనుకున్నా.. ప్రస్తుతం ఎక్కడా బెడ్లు ఖాళీగా లేవని, ఏదో ఒక ఆస్పత్రిలో ఒక బెడ్ ఖాళీ చేసేలా సుప్రీంకోర్టువారే ఆదేశాలివ్వాలని మెహతా వ్యాఖ్యానించారు. ఎస్‌జీ తీరుపై మండిపడ్డ ధర్మాసనం.. 'బెడ్ ఖాళీ చేయాలని మేమెందుకు చెబుతాం, అతనికి మెరుగైన ట్రీట్మెంట్ అందించాల్సిన బాధ్యత యూపీ ప్రభుత్వానిదే'అని చురక వేసింది. అంతేకాదు,

Recommended Video

Karnataka Lockdown : EC Responsible For Second Covid Wave - Madras High Court | Oneindia Telugu
ఇప్పటికే ఆలస్యమైందన్న సీజేఐ రమణ

ఇప్పటికే ఆలస్యమైందన్న సీజేఐ రమణ


ఉగ్ర సంస్థ ఐసిస్ తో సంబధాలున్న పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) నుంచి జర్నలిస్ట్ సిద్దిక్ కప్పన్ ఆర్థిక ప్రయోజనాలు పొందాడని, అతని విషయంలో కరుణ చూపాల్సిన అవసరం లేదని ఎస్‌జీ తుషార్ మెహతా వాదించగా, పీఎఫ్ఐపై పూర్తి స్థాయిలో నిషేధం లేనప్పుడు సిద్దిక్ కు టెర్రరిజం లింకులు ఆపాదించడమేంటని సుప్రీం బెంచ్ ప్రశ్నించింది. చిన్నస్థాయి జర్నలిస్టయిన సిద్దిక్ బ్యాంక్ అకౌంట్లో రూ.25వేల లావాదేవీని పీఐఎఫ్ కు ముడిపెట్టడం సముచితం కాదని బెంచ్ అభిప్రాయపడింది. 'ఈ జర్నలిస్టుకు సంబంధించి కేసుల విచారణ ఇప్పటికే ఆలస్యమైంది'అని సీజేఐ రమణ వ్యాఖ్యానించారు. కేవలం బీజేపీ అనుకూల పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా సిద్దిక్ కప్పన్ ను యూపీ పోలీసులు అరెస్టు చేశారేగానీ, కుట్రలు చేయడానికే హాత్రస్ వెళ్లాడనడానికి ఎలాంటి ఆధారాలు లేవని కేరళ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తరఫు న్యాయవాది విల్స్‌ మాథ్యూస్‌ కోర్టుకు విన్నవించారు. బెయిల్ పిటిషన్ కన్నా హెల్త్ ఎమర్జెన్సీకే ప్రాధాన్యమిస్తున్నట్లు మాథ్యూస్ చెప్పగా, ఢిల్లీలో చికిత్స అనంతరం సిద్దిక్ ను మళ్లీ మధుర జైలుకు పంపాలని, ఆ తర్వాత అతను బెయిల్ కోసం కింది కోర్టుల్లో దరఖాస్తు చేసుకోవచ్చని సుప్రీం బెంచ్ పేర్కొంది.

English summary
The Supreme Court on Wednesday directed that Kerala journalist Siddiqque Kappan be shifted from Uttar Pradesh's Mathura Jail to Delhi for his covid-19 treatment. "But he shall be sent back to Mathura jail once he recovers," the Supreme Court said. The order was passed by a Bench of Chief Justice of India, NV Ramana and Justices Surya Kant and AS Bopanna. The Court has also granted liberty to Siddiqque Kappan to approach an appropriate forum challenging his arrest or for any other relief.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X