సుప్రీంకోర్టు సినియర్ జడ్జికి కరోనా -కీలక సమయంలో వైరస్, వ్యాక్సిన్ సంబంధిత విచారణలు వాయిదా..
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ఉధృతంగా సాగుతూ, నిన్న కూడా 4205 మరణాలు, కొత్తగా 3.48లక్షల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొవిడ్ పరిస్థితుల నిర్వహణలో కేంద్రం వైఫల్యాన్ని ఎత్తిచూపుతోన్న సుప్రీంకోర్టు ఎప్పటికప్పుడు అవసరమైన మార్గదర్శకాలిస్తుండగా, ఆ పనికి సైతం వైరస్ అడ్డుపడినట్లయింది. కొవిడ్ విలయానికి సంబంధించిన కేసులను విచారిస్తోన్న సుప్రీం సీనియర్ జడ్జి డీవై చంద్రచూడ్ కొవిడ్ బారినపడ్డారు.
సుప్రీంకోర్టు సీనియార్టీ ప్రకారం, టాప్-4జడ్జి అయిన జస్టిస్ ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్ (డీవై చంద్రచూడ్) బుధవారం కొవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యారు. జడ్జితోపాటు ఆయన కార్యాలయ సిబ్బందిలో కొందరు సైతం పాజిటివ్ గా తేలారు. ప్రస్తుతం జడ్జి ఆరోగ్యం నిలకడగా ఉన్నప్పటికీ, డాక్టర్ల సలహా మేరకు ఐసోలేషన్ లో ఉంటున్నారు. దీంతో..

దేశంలో కరోనా విలయ పరిస్థితులు, ఆక్సిజన్ కొరత, కేంద్రం వైఫల్యం, వ్యాక్సిన్ల కొరత తదితర అంశాలపై దాఖలైన వివిధ పిటిషన్లను జస్టిస్ చంద్రచూడ్ నేతత్వంలోని ధర్మాసనం విచారిస్తున్నది. ఈ మేరకు పలు సంచలన ఆదేశాలు కూడా జారీ చేసింది. ఒక దశలో న్యాయ వ్యవస్థ లేనిదే శాసన వ్యవస్థలో కదలిక ఉండదా? అనే స్థాయికి ఆదేశాలు చేరగా, కోర్టుల అతి జోక్యం తగదంటూ కేంద్రం ఎదురుదాడికి దిగింది.
కరోనా విపత్తు నిర్వహణ, వ్యాక్సిన్ల ఉత్పత్తి, పంపిణీకి సంబంధించిన అన్ని వ్యవహారాలు కేంద్రం పక్కాగా చేపడుతున్నదని, ఈ విషయాల్లో సుప్రీంకోర్టు అతి జోక్యం తగదని, వ్యాక్సినేషన్ ప్రక్రియలో న్యాయవ్యవస్థ అత్యుత్సాహం విపరిణామాలకు దారితీస్తుందని కేంద్రం మంగళవారం నాటి అఫిడవిట్ లో పేర్కొంది. జస్టిస్ చంద్రచూడ్ కు కరోనా సోకడంతో కొవిడ్ సంబంధిత అంశాల విచారణ వాయిదాపడనున్నాయి..
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications