కార్తీ చిదంబరం పిటిషన్: ఈడీ-సీబీఐలకు సుప్రీం నోటీసులు, చిద్దూకు బీజేపీ ప్రశ్న
న్యూఢిల్లీ: కార్తీ చిదంబరం పిటిషన్ నేపథ్యంలో సుప్రీం కోర్టు సీబీఐ, ఈడీలకు నోటీసులు జారీ చేసింది. ఐఎన్ఎక్స్ మీడియాలో తనను విచారిస్తున్నందుకు ఆయన పిటిషన్ దాఖలు చేశారు.
Recommended Video

మరోవైపు, సీబీఐ కార్తి చిదంబరాన్ని సీబీఐ కోర్టులో ప్రవేశ పెట్టింది. ఆయన బెయిల్ పిటిషన్ పైన విచారణ జరుగుతోంది. సీల్డ్ కవర్‌లో విచారణ వివరాలను అందించింది. మరో ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరింది. కేంద్రమాజీ మంత్రి చిదంబరం సిబిఐ కోర్టుకు వచ్చారు.

చిదంబరంకు చిక్కులు
కేంద్ర మాజీ మంత్రి చిదంబరంపై బీజేపీ ప్రశ్నల వర్షం కురిపించింది. ఉక్కిరి బిక్కిరి చేసింది. సరిగ్గా గత లోకసభ ఎన్నికల ఫలితాల రోజే గీతాంజలి జెమ్స్ సహా ఏడు ప్రయివేటు సంస్థలకు లబ్ధి చేకూర్చేలా చిదంబరం నాటి మంత్రిగా ఎలా ఆదేశాలు ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించింది. ఈ నిర్ణయం తీసుకోవడానికి ఒత్తిడి తెచ్చిన దళారులు ఎవరు, ఎవరెవరికి ఎంత ముట్టిందో చెప్పాలని బీజేపీ నేత రవిశంకర ప్రసాద్ నిలదీశారు.












Click it and Unblock the Notifications