యూపీలో ముస్లిం విద్యార్దికి చెంపదెబ్బలు-విచారణకు సుప్రీం ఆదేశం-తీవ్ర వ్యాఖ్యలు..

యూపీలోని ముజఫర్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో ఓ ముస్లిం విద్యార్దిని తోటి విద్యార్ధులతో టీచర్ చెంపదెబ్బలు కొట్టించిన ఘటనపై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటన రాష్ట్ర ప్రభుత్వ మనస్సాక్షిని కదిలించాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఓ విద్యార్ధిని స్కూల్లో అతని మతం ఆధారంగా చెంపదెబ్బలు కొట్టించడం, మతపరమైన వ్యాఖ్యలు చేస్తుంటే అసలు విద్యాహక్కు చట్టం అమలవుతుందా అని యోగీ సర్కార్ ను ప్రశ్నించింది.

ముజఫర్‌నగర్‌లోని పాఠశాలలో ఉపాధ్యాయురాలు తన సహవిద్యార్థిని చెప్పుతో కొట్టమని ఆదేశించిన ఘటన ఓ మతాన్ని లక్ష్యంగా చేసుకుందని, ఈ ఘటనకు యూపీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని సుప్రీంకోర్టు తెలిపింది. పాఠశాల విద్యార్థులు తమ ఉపాధ్యాయుని సూచనల మేరకు ఏడుస్తున్న ముస్లిం విద్యార్థిని వంతులవారీగా కొట్టడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ దాఖలైన పిటిషన్ పై ఇవాళ న్యాయమూర్తులు అభయ్ ఎస్ ఓకా, పంకజ్ మిథాల్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.

sc order inquiry on slapping muslim student in uttar pradesh with senior ips, key comments..

గత నెలలో బయటపడిన ఈ వీడియో వైరల్ అయింది. ఇందులో టీచర్ తోటి విద్యార్ధులతో ముస్లింవిద్యార్ధిని చెంపదెబ్బలు కొట్టించడం, మతపరమైన వ్యాఖ్యలు చేయడంతో తీవ్ర వివాదం రేగింది. దీంతో ప్రభుత్వం టీచర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఉత్తరప్రదేశ్ పోలీసులు ఈ కేసును విచారించే విషయంలో తమకు తీవ్ర అభ్యంతరాలు ఉన్నాయని సుప్రీంకోర్టు తెలిపింది. టీచర్ ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకుందని,తాము దీనిపై లోతుగా విచారణ చేస్తామని తెలిపింది. ఉపాధ్యాయులు విద్యార్థులకు బోధించే విధానం ఇదేనా - ఇదేనా నాణ్యమైన విద్య? ఈ సంఘటనకు రాష్ట్రం బాధ్యత వహించాలని సూచించింది.

ఈ ఘటన రాష్ట్ర ప్రభుత్వ మనస్సాక్షిని కదిలించాలని, ఈ ఘటన తర్వాత అయినా ప్రభుత్వం సదరు స్కూల్లో విద్యార్ధులకు కౌన్సిలింగ్ ఇచ్చేందుకు కౌన్సిలర్ ని నియమించిందా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇది విద్యార్ధులను శారీరకంగా,మానసికంగా వేధించడం,వారిపై మత, కులపరమైన వివక్షను నిషేధించే విద్యాహక్కు చట్టంలోని నిబంధనలను పాటించడంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విఫలమైందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

బాధిత విద్యార్ధి మానసిక క్షోభను అధిగమించేందుకు నిపుణులైన చైల్డ్ కౌన్సెలర్‌ను నియమించి కౌన్సెలింగ్ అందించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ధర్మాసనం సూచించింది. విచారణను పర్యవేక్షించేందుకు సీనియర్ ఐపీఎస్ అధికారిని నియమించి మూడు వారాల్లోగా కోర్టుకు నివేదిక సమర్పించాలని ఆదేశించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+