కోల్‌గేట్‌లో ప్రధానిని పార్టీ చేయడానికి సుప్రీం నో
న్యూఢిల్లీ: కోల్‌గేట్ కుంభకోణంలో సిబిఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లో ప్రధాని మన్మోహన్ సింగ్ పేరును చేర్చాలని వేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. ప్రధానికి కోల్ బ్లాక్ కేసు విషయంలో ఏ విధమైనటువంటి ఆదేశాలు జారీ చేసేందుకు సుప్రీం కోర్టు అంగీకరించలేదు. కోల్‌గేట్ కుంభకోణంలో సిబిఐ విచారణ జరుగుతున్నందున ఆ విషయంపై వారే దృష్టి సారిస్తారని సుప్రీం తెలిపింది.
గతంలో సిబిఐ వేసిన పిటిషన్ మేరకు కోల్‌గేట్ కుంభకోణంపై విచారించేందుకు సిబిఐ బృందానికి మరో అధికారిని నియమించుకునేందుకు కోర్టు అనుమతించడం జరిగింది. కాగా మరో అధికారిని తమకు కేటాయించాలని సోమవారం సుప్రీం కోర్టులో సిబిఐ పిటిషన్ వేసింది. ఇప్పటికే కోల్ గేట్ కుంభకోణంలో విచారణ జరిపే బృందంలో 39మంది అధికారులు విధులు నిర్వహిస్తున్నారు.

తాజాగా సిబిఐ వేసిన పిటిషన్‌ను పరిశీలించిన సుప్రీం కోర్టు సిబిఐ విచారణ బృందంలో ఎలాంటి మార్పు చేసుకునేందుకు అనుమతించలేదు. కాగా కోల్‌గేట్ కుంభకోణంలో కుమార మంగళం బిర్లా, మాజీ బొగ్గు శాఖ కార్యదర్శి పిసి పరేఖ్ పేర్లను సిబిఐ తమ ఛార్జీషీటులో నమోదు చేయడం జరిగింది. దీంతో కుంభకోణం జరిగిన సమయంలోనూ, ప్రస్తుతం ప్రధాని పదవిలో ఉన్న మన్మోహన్‌పై ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి.
ప్రధాని పేరును కూడా సిబిఐ ఛార్జీషీటులో చేర్చాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రతిపక్షాల ఆరోపణల నేపథ్యంలో ప్రధాని మన్మోహన్ సింగ్ ఇటీవల స్పందించారు. తను చట్టానికి అతీతుడ్ని కాదని తెలిపారు. కుంభకోణం విషయంలో దాచాల్సిన విషయం ఏమి లేదని, సిబిఐ విచారణ కొనసాగిస్తోందని ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications