సాకులొద్దు: సోషల్ మీడియా దుర్వినియోగంపై సుప్రీంకోర్టు సీరియస్, కేంద్రానికి గడువు
న్యూఢిల్లీ: సోషల్ మీడియా దుర్వినియోగం కావడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. సోషల్ మీడియా దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు మార్గదర్శకాలు రూపొందించాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని మంగళవారం ఆదేశించింది.
తమ వద్ద అంత సాంకేతికత లేదనే సాకులు చెప్పి తప్పించుకోవద్దని కేంద్రానికి స్పష్టం చేసింది. మార్గదర్శకాల రూపకల్పనకు కావాల్సిన సమయాన్ని మూడు వారాల్లోగా తెలియజేయాలని కేంద్రాన్ని ఆదేశించింది.

జస్టిస్ దీపక్ గుప్తా, అనిరుధా బోస్‌లతో కూడిన ధర్మాసనం సోషల్ మీడియా దుర్వినియోగంపై మంగళవారం విచారణ చేపట్టింది. నకిలీ వార్తల్ని ఎవరు, ఎక్కడ సృష్టిస్తున్నారో కొన్ని సోషల్ మీడియా సంస్థలు గుర్తించలేకపోవడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. దీనికి సంబంధించిన సాంకేతికత లేదంటూ తప్పించుకునే ప్రయత్నం చేయొద్దని కేంద్రానికి తేల్చి చెప్పింది.
సృష్టించే సాంకేతిక ఉన్నప్పుడు.. అడ్డుకునే సాంకేతికత కూడా ఉంటుంది కదా అని వ్యాఖ్యానించింది. సాంకేతికత అంశాలతో ముడిపడిన ఈ సమస్య పరిష్కారానికి కోర్టులు సరైన వేదికలు కావని, ప్రభుత్వమే జోక్యం చేసుకుని తగు మార్గదర్శకాలను రూపొందించాలని ఆదేశించింది.
ఇటీవల కాలంలో ఫేస్‌బుక్, వాట్సప్, ట్విట్టర్, టిక్‌టాక్ లాంటి సోషల్ మీడియా మాధ్యమాల్లో తప్పుడు, నకిలీ వార్తలు ఎక్కువగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అది ఎలాంటి వార్త అయిన సోషల్ మీడియా ద్వారా అత్యంత వేగంగా జనాల్లోకి వెళ్లిపోతోంది.
అయితే, అవి వినియోగదారులను తప్పుదోవ పట్టించేవిగా ఉండటం, జనాల్లో అనవసర ఆందోళనలకు దారితీయడంతో సుప్రీంకోర్టు ఈ విషయంపై సీరియస్‌గా స్పందించింది. కేంద్రం ఇప్పటికే సోషల్ మీడియా సంస్థలు నకిలీ వార్తలపై ఓ కన్నేసి ఉంచాలని, వాటిని కట్టడి చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
-
మహేశ్‌కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్‌కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!!












Click it and Unblock the Notifications