వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లఖీమ్‌పూర్ ఘటన: సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ, జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలో..

|
Google Oneindia TeluguNews

ఉత్తరప్రదేశ్ లఖీమ్‌పూర్ ఘటన చర్చకు దారితీసింది. నిరసన చేస్తోన్న రైతులపై వాహనం వెళ్లనీయడం.. తర్వాత జరిగిన ఉద్రిక్తతలతో 8 మంది వరకు చనిపోయారు. ఘటనపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా స్పందించింది. ఇన్సిడెంట్ గురించి ఎవరూ పిటిషన్ ఫైల్ చేయకున్నా.. సుమోటోగా కేసు విచారణకు స్వీకరించింది. ఈ కేసును సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలో గల ధర్మాసనం గురువారం విచారించనుంది.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. రైతులకు మద్దతు ధర కోసం శాంతియుతంగా నిరసన చేపడుతున్న సంగతి తెలిసిందే. ఉత్తరప్రదేశ్‌ లఖింపూర్‌లో కూడా రైతులు నిరసన తెలియజేస్తుండగా.. కేంద్రమంత్రి కుమారుడు కారుతో తొక్కించాడు. ఆ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు 8 మంది చనిపోయారు.

SC takes Suo Motu cognisance of Lakhimpur Kheri violence

లఖిమ్‌పూర్‌ ఖేరీలో డిప్యూటీ సీఎం కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య కార్యక్రమానికి హాజరవుతున్న విషయం తెలుసుకున్న రైతులు నల్లజెండాలతో నిరసన తెలుపాలని భావించారు. కేంద్రం తీసుకొచ్చిన చట్టాలను వెనక్కి తీసుకోవాలంటూ రోడ్డుపై బైఠాయించేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో ఓ కారు రైతులపైకి దూసుకొచ్చింది. అందరు చూస్తుండగానే రైతులను ఢీ కొని వెళ్లిపొయింది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్రా తనయుడు ఆశిష్‌ మిశ్రా కారు నడుపుతున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. డిప్యూటీ సీఎం కేశవ్‌ ప్రసాద్‌ మౌర్యకు స్వాగతం పలికి తీసుకొచ్చేందుకు ఆశీష్‌ మిశ్రా వెళ్తున్నట్లుగా సమాచారం.

Recommended Video

Noorjahan Mango Costs ₹ 1,000 Per Piece|Madhya Pradesh | Oneindia Telugu

లఖిమ్‌పూర్ ఘటనపై నిరసనలు పెల్లుబికుతున్నాయి. మృతుల కుటుంబీకులను పరామర్శించేందుకు వెళ్లిన ప్రియాంక గాంధీని అడ్డుకున్నారు. ఇవాళ కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ కూడా లఖిమ్ పూర్ వెళ్లారు. తనకు ఎస్కార్ట్ వద్దన్న.. కల్పించారు. దీంతో తప్పక రాహుల్ వెళ్లాల్సి వచ్చింది. ఇద్దరు సీఎంలతో కలిసి రాహుల్ వెళ్లారు.

English summary
Supreme Court of India has taken suo moto cognizance of the violence that claimed eight lives in Uttar Pradesh's Lakhimpur Kheri.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X