Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

CJI NV Ramana మరో సంచలనం? -హైకోర్టు జడ్జిలుగా సుప్రీం లాయర్లకు ఎలివేషన్! -ఒకే చెప్పారన్న బార్

న్యాయ వ్యవస్థకు సంబంధించి భారత సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారా? పెండింగ్ కేసులు పెరగడానికి ప్రధాన కారణమైన న్యాయమూర్తుల కొరతకు ఆ నిర్ణయం పరిష్కారం కానుందా? జడ్జిల నియామకాలకు సంబంధించి కొలీజియం పరిధి విస్తృతం కానుందా? అంటే సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (ఎస్‌సీబీఏ) అవుననే సమాధానం చెబుతున్నది..

సీజేఐ సంచలన నిర్ణయం

సీజేఐ సంచలన నిర్ణయం

అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న 25 హైకోర్టుల్లో న్యాయమూర్తుల కొరత నెలకొని ఉండటం, మాజీ సీజేఐ ఎస్ఏ బోబ్డే తన 14 నెలల పదవీకాలంలో ఒక్కటంటే ఒక్క నియామకాన్ని కూడా చేపట్టకపోవడం, భారీ ఎత్తున జడ్జిల నియామకాలు చేపట్టాల్సిన భారం ప్రస్తుత సీజేఐ ఎన్వీ రమణపై ఉండటం తెలిసిందే. ఈ క్రమంలోనే ఓ సరికొత్త ప్రతిపాదనకు సీజేఐ ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదులుగా కొనసాగుతున్నవారిలో అర్హులైన కొందరికి రాష్ట్రాల హైకోర్టుల్లో జడ్జిలుగా ఎలివేషన్ ఇవ్వాలన్న ప్రతిపాదనకు సీజేఐ అంగీకరించారని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ పేర్కొంది.

ఎంపిక కోసం కమిటీ ఏర్పాటు..

ఎంపిక కోసం కమిటీ ఏర్పాటు..


సుప్రీంకోర్టులో సీనియర్ లాయర్లుగా కొనసాగుతోన్నవారిలో కొందరికి సివిల్, క్రిమినల్, రాజ్యాంగ, వాణిజ్య చట్టాలపై మంచి పట్టుందని, న్యాయవ్యవస్థలో వారికున్న సుదీర్ఘ అనుభవంతో తీర్పులివ్వగలిగే సత్తా ఉందని, అలాంటి వారికి హైకోర్టుల్లో జడ్జిలుగా ఎలివేషన్ ఇవ్వాలనే ప్రతిపాదనను సీజేఐ రమణ ముందు ఉంచగా, అందుకాయన అంగీకారం తెలాపారని, ఈ మేరకు 'హైకోర్టు జడ్జిలుగా సుప్రీం లాయర్ల ఎలివేషన్' అమలయ్యేలా హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులకు సీజేఐ సూచనలతో కూడిన విజ్ఞప్తిని చేసేందుకూ అంగీకరించారంటూ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడైన వికాస్ సింగ్ ఆ బార్ ఎగ్జిక్యూటివ్ సభ్యులకు మే31న ఒక సమాచారన్ని చేరవేశారు. ఎలివేషన్ కు అర్హులైన సీనియర్ లాయర్లను గుర్తించేందుకు బార్ ఓ సెర్చ్ కమిటీని కూడా ఏర్పాటు చేసిందని, సీనియర్ లాయర్లు మహాలక్ష్మి పావని, రాకేశ్ ద్వివేది, శేఖర్ నాపడే, విజయ్ హన్సారియా, వి.గిరిలు ఆ కమిటీలో సభ్యులుగా ఉంటారని ఎస్‌సీబీఏ పేర్కొంది. కాగా,

భిన్నంగా సీజేఐ ఆఫీసు స్పందన..

భిన్నంగా సీజేఐ ఆఫీసు స్పందన..


సుప్రీంకోర్టులోని సీనియర్ అడ్వొకేట్లను రాష్ట్రాల హైకోర్టుల్లో జడ్జిలుగా ఎలివేషన్ కల్పించే ప్రతిపాదనకు సీజేఐ రమణ అంగీకరించారని, దీనిపై హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులకు ఆయన కమ్యూనికేట్ చేస్తారని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ చేసిన ప్రకటనపై సీజేఐ కార్యాలయం భిన్నంగా స్పందించింది. సదరు ప్రతిపాదన జస్టిస్ రమణ వద్దకు చేరినమాట వాస్తవమేనని, ఈ విషయమై బార్ అసోసియేషన్ ప్రతినిధులు సీజేఐను కలిశారని, అయితే, దీనిపై జస్టిస్ రమణ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సీజేఐ కార్యాలయం పేర్కొంది. కానీ, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ముఖ్యులైన పలువురు సీనియర్ లాయర్లు మాత్రం అంగీకారం వచ్చేసిందేనని అంటున్నారు. న్యాయవ్యవస్థకు సంబంధించి కీలక మార్పులాంటి ఈ పరిణామంపై రాబోయే రోజుల్లో మరింత క్లారిటీ రానుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+