ఒకటో తరగతి విద్యార్థిపై వేడి వేడి పప్పు విసిరిన వంట మనిషి
భోపాల్: మరింత పెట్టమని అగడమే ఆ విద్యార్థి చేసుకున్న పాపమైంది. మధ్యాహ్న భోజనం పెడుతన్న సమయంలో ఒకటో తరగతి విద్యార్థి మరింత కావాలని అడిగాడు. దాంతో ఆగ్రహించిన పాఠశాల వంట మనిషి అతనిపైకి వేడి వేడి పప్పు విసిరింది.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఆ సంఘటన చోటు చేసుకుంది. వేడి వేడి దాల్ మీద పడడంతో విద్యార్థి ముఖం, బుగ్గలు, ఛాతీ కాలిపోయాయి. అతన్ని భోపాల్‌కు 480 కిలోమీటర్ల దూరంలో గల దిండోరీ ఆస్పత్రిలో చేర్చారు.

దిండోరి ప్రాథమిఖ పాఠశాలలో మధ్యాహ్న భోజనం సమయంలో ప్రిన్స్ మెహ్రా మరింత పప్పు కోసం అడిగాడు. వంట మనిషి నేమావతి బాయి ఆగ్రహించి అతనిపై పప్పు పోసిందని బాలుడి నానమ్మ ఆరోపించారు.
సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన జనవరి 23వ తేదీన జరిగింది. బాలుడి కుటుంబ సభ్యులు జనవరి 24వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications