ట్యూషన్ చెప్పాలని పిలిపించి, టీచర్‌పై ప్రిన్సిపల్ రేప్ యత్నం
ఘజియాబాద్: ముప్పై ఏళ్ల ఉపాధ్యాయురాలి పైన అత్యాచార యత్నం చేసిన ఓ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్ జిల్లా నందగ్రామ్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు నిందితుడిని శనివారం సాయంత్రం అరెస్టు చేశారు.
40 ఏళ్ల దీప్ త్యాగి బాధిత ఉపాధ్యాయురాలిని ఓ ఇంటికి పిలిపించాడు. కొందరు విద్యార్థులకు ట్యూషన్ చెప్పాలని, అందుకోసం రావాలని అతను ఆమెను రాజ్ నగర్ ఎక్స్‌టెన్షన్ ప్రాంతానికి తీసుకు వెళ్లాడు.

అక్కడ ఆమె పైన అత్యాచారయత్నం చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధిత ఉపాధ్యాయురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 376, 511 తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు.












Click it and Unblock the Notifications