సర్టిఫికెట్లు కావాలా?.. అయితే కోరిక తీర్చాల్సిందే: టీచర్‌కు వేధింపులు

Subscribe to Oneindia Telugu

చెన్నై: ఓ ప్రైవేట్ స్కూల్ టీచర్ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కరస్పాండెంట్‌ను పోలీసులు అరెస్టు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు మీడియాకు వివరాలు వెల్లడించారు.

పోలీసుల కథనం ప్రకారం.. చెన్నైకి చెందిన ఓ మహిళ స్థానికంగా ఉన్న ఒక ప్రైవేటు స్కూల్లో టీచర్ గా పనిచేస్తోంది. రెండు నెలల క్రితం ఆమె తన ఉద్యోగాన్ని వదిలేసింది. శుక్రవారం రోజు స్కూల్ కు వెళ్లి తన ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఇవ్వాల్సిందిగా కోరింది. దీంతో తన గదిలోకి రావాలంటూ కరస్పాండెంట్ రవి పిలిచాడు.

 School Staff Arrested For Sexually Harassing Teacher In Chennai

అతను చెప్పినట్లుగానే అక్కడికి వెళ్లగా.. కోరిక తీర్చాలంటూ ఒత్తిడి చేశాడు. లేదంటే సర్టిఫికెట్స్ ఇవ్వనని, బయట చెడుగా ప్రచారం చేస్తానని బెదిరించాడు. ఏం చేయాలో తెలియక.. ఆ మహిళ ఏమి మాట్లాడకుండా అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోయింది. ఆపై అసభ్య మెసేజ్ లతో సదరు కరస్పాండెంట్ ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. దీంతో ఇక లాభం లేదనుకుని ఆమె పోలీసులను ఆశ్రయించింది.

PET teacher sexual harassment on girls : Genius Grammar School, Bandlaguda - Oneindia Telugu

బాధితురాలి ఫిర్యాదు మేరకు అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A correspondent of a private school has been arrested by the Chennai police for sexually harassing a woman teacher.
Please Wait while comments are loading...