viral:హవ్వా.. జెండా పండగ కోసం రూ.15 ఇవ్వాలా..? ఏందీ టీచర్ ఇదీ
సరిగ్గా 75 ఏళ్ల క్రితం బ్రిటిష్ బానిస సంకెళ్ల నుంచి భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. ఈ ఆగస్ట్ 15వ తేదీప భారతావని 75వ ఇండిపెండెన్స్ డే జరుపుకోనుంది. ఇందుకోసం యావత్ దేశం సంసిద్దమైంది. అయితే కొన్ని చోట్ల అనూహ్య ఘటనలు జరుగుతున్నాయి. అవును ఆ ఇన్సిడెంట్స్ మచ్చలా మారుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో అలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది.
జెండా పండగ అంటే పిల్లలకు పండగే.. స్కూల్‌కు వెళ్లి.. జాతీయ గీతం ఆలపిస్తారు. ప్రముఖులు వచ్చి ఆనాటి స్వాతంత్ర్య సమరయోధుల గురించి చెబుతారు. అయితే యూపీలో గల హత్రాస్ ప్రభుత్వ పాఠశాల ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌కు సిద్దమవుతుంది. అయితే విద్యార్థులను ఓ టీచర్ వేడుకల కోసం, జెండా కోసం రూ.15 కావాలని అడుగుతున్నాడు. ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.

అలా తీసుకురావాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిందట.. ఆ విషయం వీడియోలో చెప్పాడు. దీంతో దుమారం రేగింది. జెండా పండగ కోసం డబ్బులు వసూల్ చేయడం ఏంటీ అనే చర్చ జరుగుతుంది. వీడియోను చాలా మంది షేర్ చేస్తున్నారు. నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. తెగ కామెంట్లు పెడుతున్నారు. ఆ టీచర్ ఇలా చేయడం ఏంటీ అని అడుగుతున్నారు.












Click it and Unblock the Notifications