కుంభమేళా వేళ పాఠశాలలకు ప్రత్యేక సెలవులు..!!

Mahakumbh Mela 2025: మహాకుంభమేళా కు భక్తుల రద్దీ భారీగా పెరిగింది. దేశ విదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లే వారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. ఫిబ్రవరి 26 వరకు జరిగే ఈ కుంభమేళాకు దాదాపు 40 కోట్ల మంది వస్తారని అంచనా. ఇప్పటికే 12 కోట్ల మంది వరకు పుణ్య స్నానాలు చేసినట్లు చెబుతున్నారు. ప్రయాగ్ రాజ్ నుంచి కాశీకి వచ్చే వారి సంఖ్య పెరుగుతుండటంతో విద్యా సంస్థలకు సెలవులు ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

మహాకుంభ మేళా రికార్డులు తిరగరాస్తోంది. దేశ విదేశాల నుంచి వస్తున్న భక్తులతో ప్రయాగ్ రాజ్ రద్దీగా మారింది. యూపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. వచ్చే వారం రాష్ట్రపతి, ప్రధాని సహా పలువురు ప్రముఖులు కుంభమేళాకు తరలి రానున్నారు. పెరుగుతున్న రద్దీ తో పాఠశాలల కు వెళ్లే విద్యార్ధులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాగ్ రాజ్ నుంచి వారణాసికి వచ్చే భక్తుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. దీంతో, విద్యా సంస్థలకు ఫిబ్రవరి 5వ తేదీ వరకు సెలవులు ఇస్తూ యూపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

schools from class one to eight have been closed till February 5 due to increasing crowd in Mahakumbh

దీంతో, వారణాసి జిల్లాలో ఉన్న అన్ని పాఠశాలలను నేటి నుంచి ఫిబ్రవరి 5 వరకు సెలవులు ప్రకటిస్తూ జిల్లా విద్యా శాఖ అధికారి ఆదేశాలు జారీ చేసారు. అదే సమయంలో పరీక్షల సమయం దగ్గర పడుతుండటంతో విద్యార్ధులకు ఇబ్బంది లేకుండా ఒకటవ తరగతి నుంచి 12వ తరగతి వరకు అన్నీ క్లాసులకు ఆన్ లైన్ బోధన కొనసాగించాలని ఆదేశించారు.

ఇక, ప్రయాగ్ రాజ్ కు వెళ్లే ప్రత్యేక రైళ్లన్నీ నిండుకున్నాయి. విమానాలు అదనంగా పెద్ద మొత్తంలో ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. ఫిబ్రవరి 1న 73 దేశాలకు చెందిన దౌత్యవేత్తల కుంభమేళా లో స్నానాల కోసం తరలి వస్తున్నారు. వీరి కోసం యూపీ ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+