వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ చెబుతారేమో కానీ.. సైన్స్ అబద్దాలు చెప్పదు: డబ్ల్యూహెచ్‌ఓ కరోనా మరణాల రిపోర్టుపై రాహుల్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారతదేశంలో కరోనా వైరస్ మరణాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) వెల్లడించిన గణాంకాలను ఆధారంగా చేసుకుని ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. నరేంద్ర మోడీ అబద్ధాలు చెప్పారు కానీ.. సైన్స్ అబద్ధాలని చెప్పదని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. దేశంలో 4.7 మిలియన్ల మంది ప్రజలు కరోనాతో మరణించారని డబ్ల్యూహెచ్ఓ గణాంకాలను రాహుల్ గాంధీ ప్రస్తావించారు.

భారతదేశంలో కరోనా బారినపడి 47 లక్షల మంది భారతీయులు మరణించారని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోందని.. అయితే భారత ప్రభుత్వం మాత్రం కేవలం 4.8 లక్షల మంది మాత్రమే మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయారని వెల్లడించిందని రాహుల్ గాంధీ విమర్శించారు. ప్రధాని మోడీ అబద్ధాలు ఆడతారు కావొచ్చు కానీ.. సైన్స్ అబద్ధాలు చెప్పదని రాహుల్ వ్యాఖ్యానించారు.

 Science Doesnt Lie, Modi Does: Rahul Gandhi slams PM, On WHO Covid Deaths Report.

కరోనాతో మరణించినవారందరి కుటుంబాలకు రూ. 4 లక్షలు ఇచ్చి ఆదుకోవాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. కాగా, ప్రపంచ వ్యాప్తంగా 6 మిలియన్ల కరోనా మరణాలు నమోదు కాగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం 15 మిలియన్ల మంది కోవిడ్ తో ప్రాణాలు కోల్పోయారని తాజాగా ప్రకటించడం గమనార్హం.

డబ్ల్యూహెచ్ఓ చెప్పిన గణాంకాలను భారత్ తిరస్కరించింది. వాస్తవ గణాంకాలకు ఇవి దూరంగా ఉన్నాయని తెలిపింది. స్టాటికల్ గానూ, సైంటిఫికల్ గానూ ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్న లెక్కలు ఆమోదయోగ్యం కావని భారత ప్రభుత్వం పేర్కొంది. డబ్ల్యూహెచ్ఓ డేటా తప్పులతడకగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. డబ్ల్యూహెచ్ఓ సరైన పద్ధతిని పాటించకపోవడం వల్లే ఎక్కువ మరణాలు సంభవించినట్లుగా గణాంకాలు వస్తున్నాయని వ్యాఖ్యానించింది.

కాగా, పలువురు ఆరోగ్య నిపుణులు కూడా డబ్ల్యూహెచ్ఓ గణాంకాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రపంచంలోని అన్ని దేశాలకు ఒకటే అప్రోచ్ సరికాదని సూచించారు. భారత కోవిడ్ వర్కింగ్ గ్రూప్ చీఫ్ డాక్టర్ ఎన్‌కే అరోరా మాట్లాడుతూ.. డబ్ల్యూహెచ్ఓ నివేదికలు ఆందోళన కలిగించేవిగా ఉన్నాయని అన్నారు. కరోనా మరణాలపై భారత్ గణాంకాలు వాస్తవమైనవని స్పష్టం చేశారు. డబ్ల్యూహెచ్ఓ గణాంకాలను నీతి ఆయోగ్ ఆరోగ్య సభ్యుడు వీకే పాల్ కూడా తిరస్కరించారు. మన దేశానికి డబ్ల్యూహెచ్ఓ పద్ధతులు సరిపోవని అన్నారు. భారతదేశంలో ఒక పద్ధతి ప్రకారం మరణాలను నమోదు చేయడం జరిగిందని స్పష్టం చేశారు.

English summary
"Science Doesn't Lie, Modi Does": Rahul Gandhi slams PM, On WHO Covid Deaths Report.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X