Scotland of India: స్కాంట్లాండ్ ఆఫ్ ఇండియాగా పిలిచే టూరిస్ట్ ప్లేస్ ఎక్కడుందో తెలుసా..?

భారత్ లో అనేక టూరిస్టు ప్రాంతాలు ఉన్నాయి. కొండలు.. కోనలతోపాటు ఎన్నో ప్రకృతి రమణీయమైన ప్రదేశాలకు నెలవుగా భారత్ ఉంది. ఇక దక్షిణాది రాష్ట్రాలైన ఏపీ, కేరళ, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాలు పచ్చదనానికి ప్రసిద్ధి చెందాయి. అలాగే ఈ రాష్ట్రాల్లో చాలా హిల్ స్టేషన్స్ ఉన్నాయి. వాటిలో ప్రసిద్ధమైనది కర్ణాటకలోని కొడగు లేదా కూర్గ్ హిల్ స్టేషన్ ఒకటి. ఈ ప్రాంతాన్ని స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. అందుకు కారణం ఇక్కడి పచ్చని ప్రకృతి రమణీయమైన ప్రదేశాలు.. కాఫీ తోటలు.. అద్భుతమైన జలపాతాలే.. వీటితో పాటు కూర్గ్ లో అనేక పర్యాటక ప్రాంతాలు కనువిందు చేస్తున్నాయి. వాటిల్లో రాజా సీట్ ముఖ్యమైనది. ఈ వ్యూ పాయింట్ మడికేరి పట్టణంలో ఉంది. ఇది సూర్యాస్తమయం, సూర్యోదయం చూసేందుకు బెస్ట్ వ్యూ పాయింట్ గా ప్రసిద్ధి చెందింది. పూర్వకాలంలో కొడగును పరిపాలించిన రాజులు తమ కుటుంబంతో వచ్చి ఇక్కడి వ్యూ పాయింట్ నుంచి కొడగు అందాలను ఆస్వాధించేవారని చెబుతుంటారు.

అలాగే మడికేరి కోట కూడా చాలా ఫేమస్.. ఈ కోట 17 వ శతాబ్దానికి చెందినది. ఈ కోట లోపల చిన్న మ్యూజియం కూడా ఉంది. అలాగే ఇక్కడే ప్రాచీన దేవాలయాలు కూడా ఉన్నాయి. ఇక కూర్గ్ లో అబ్బే జలపాతం ఉంది. ఈ జలపాతం మడికేరి ప్రాంతానికి సుమారు 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ జలపాతం ఎదురుగా ఉన్న హ్యాంగింగ్ బ్రిడ్జ్ పై నిల్చొని ప్రకృతి అందాలను తనివితీరా ఆస్వాదించడం మరచిపోలేని అనుభూతిగా చెబుతారు. ఇక్కడే దుబారే ఏనుగుల శిబిరం కూడా ఉంది. ఇక్కడ ఉన్న ఏనుగులు, వాటి చేష్టలను దగ్గర్నుంచి చూసే అవకాశం ఉంది.

Scotland of India latest neews Do you know where the tourist place known as Scotland of India is

దాంతోపాటు నామ్‌ డ్రోలింగ్ ఆరామం ఇక్కడ ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంతాన్ని గోల్డెన్ టెంపుల్ అని పిలుస్తుంటారు. ఇక్కడి మఠంలోని గోడలు బంగారు వర్ణంతో నిండిన చిత్రాలతో అలంకరించబడి ఉంటాయి. ఈ ప్రాంతం పర్యటకులు సందర్శించడానికి అనువైన ప్రదేశంగా చెబుతారు. అలాగే ఇక్కడ ఓంకారేశ్వరాలయం కూడా ఉంది. దీనిని 19వ శతాబ్దంలో నిర్మించారు. ఈ ఆలయాన్ని శివ భగవానుడికి అంకితం చేస్తూ లింగ రాజేంద్ర నిర్మించారని ఓ కథనం వాడుకలో ఉంది. ఇక కూర్గ్ ప్రాంతాన్ని అక్టోబర్ నుంచి మార్చి వరకు చూసేందుకు బెస్ట్ టైమ్ గా చెబుతుంటారు. ఇంకెందుకు ఆలస్యం ఈ వింటర్ సీజన్ లో ఈ టూరిస్ట్ స్పాట్ పై ఓ లుక్కేయండి..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+