Wife: లవ్ మ్యారేజ్, భార్యను 15 సార్లు పొడిచేసి తల మీద బండరాయితో ?, ఆంధ్రా మొగుడి అరాచకం !
బెంగళూరు/చిత్తూరు: యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. లవ్ మ్యారేజ్ చేసుకుని సంతోషంగా జీవితం సాగించిన దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. దంపతుల మద్య తేడాలు రావడంతో విడిపోయారు. పిల్లలతో కలిసి భార్య వేరుగా ఉంటున్నది. ఆంధ్రప్రదేశ్ లో ఉంటున్న భర్త పిల్లలను చూడటానికి భార్య ఇంటికి వెళ్లారు. భార్యతో చక్కగా మాట్లాడి ఆమెతో మంచితనంగా ఉన్ననట్లు నటించిన భర్త ఆమెను ఇంటి నుంచి బయటకు పిలుచుకుని వచ్చాడు. భార్యతో మాట్లాడుతున్న సమయంలోనే జోబులో ఉన్న కత్తితో ఆమెను 15 సార్లకు పైగా పొడిచేశాడు. కిందపడిన కొంత సేపటికి తప్పించుకోవడానికి ప్రయత్నించిన భార్య తల మీద పెద్దరాయితో చితకబాదేశాడు. భార్యను పొడిచేసిన భర్త ఆత్మహత్యాయత్నం చేశాడు. భార్యను కిరాతకంగా పొడుస్తుంటే భర్తను అడ్డుకోకుండా స్థానికులు మొబైల్ లో వీడియోలు తీసి షేర్ చెయ్యడం కలకలం రేపింది.

లవ్ మ్యారేజ్
ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాకు చెందిన రమేష్ కొన్ని సంవత్సరాల క్రితం బెంగళూరు గ్రామీణ జిల్లాలోని హోస్ కోటేలో నివాసం ఉంటూ ఉద్యోగం చేసేవాడు. ఆ సందర్బంలో అశ్వినీ అనే యువతి రమేష్ కు పరిచయం అయ్యాంది. ప్రేమించుకున్న రమేష్, అశ్వినీ 7 సంవత్సరాల క్రితం లవ్ మ్యారేజ్ చేసుకున్నారు.

విడిపోయిన దంపతులు
లవ్ మ్యారేజ్ చేసుకుని సంతోషంగా జీవితం సాగించిన రమేష్, అశ్వినీ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అశ్వినీ, రమేష్ దంపతుల మద్య తేడాలు రావడంతో రెండు సంవత్సరాల క్రితం ఇద్దరూ విడిపోయారు. పిల్లలతో కలిసి అశ్విని హోస్ కోటే సమీపంలోని సూలిబెలె పోలీస్ స్టేషన్ పరిధిలోని పిల్లగుంప ఇండస్ట్రియల్ ఏరియాలో నివాసం ఉంటూ ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తున్నది.

నాటకాలు ఆడిన భర్త ఏం చేశాడంటే ?
ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన రమేష్ అతని భార్య అశ్వినీ నివాసం ఉంటున్న ఇంటి దగ్గరకు వెళ్లాడు. పిల్లలను చూడటానికి అశ్వినీ ఇంటికి వెళ్లిన రమేష్ మంచిగా ఉన్నట్లు ఆమెతో నటించాడు. భార్య అశ్వినీతో చక్కగా మాట్లాడి ఆమెతో మంచితనంగా ఉన్ననట్లు డ్రామాలు ఆడిన రమేష్ ఆమెను ఇంటి నుంచి బయటకు పిలుచుకుని వచ్చాడు.

భార్యను 15 సార్లు కత్తితో పొడిచిన భర్త
అశ్వినీతో మాట్లాడుతున్న సమయంలోనే జోబులో ఉన్న కూరగాయలు కోసే కత్తితో ఆమెను 15 సార్లకు పైగా ఇష్టం వచ్చినట్లు ఎక్కడంటే అక్కడ పొడిచేశాడు. అశ్వినీ కుప్పకూలిపోయింది. అదే కత్తితో రమేష్ కూడా పొడుచుకుని భార్య అశ్వినీ మీద పడిపోయాడు. రెండు నిమిషాలకు అశ్వినీ మీదపడి ఉన్న భర్త రమేష్ ను పక్కకు తోసేసి అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించింది.

వీడియో వైరల్
తప్పించుకోవడానికి ప్రయత్నించిన అశ్వినీని పట్టుకున్న రమేష్ బండరాయి తీసుకుని ఆమె తల మీద చితకబాదేశాడు. భార్య అశ్వినీని పొడిచేసిన రమేష్ కూడా ఆత్మహత్యాయత్నం చేశాడు. భార్య అశ్వినీని రమేష్ కిరాతకంగా పొడుస్తుంటే భర్తను అడ్డుకోకుండా స్థానికులు మొబైల్ లో వీడియోలు తీసి షేర్ చెయ్యడం కలకలం రేపింది.

కొంచెం ధైర్యం చేసి ఉంటే ?
తీవ్రగాయాలైన అశ్వినీ పరిస్థితి విషమంగా ఉందని, ఆమె ఐసీయూలో చికిత్స పొందుతున్నదని, రమేష్ కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని సూలిబెలే పోలీసులు తెలిపారు. మొబైల్ లో వీడియోలు తియ్యకుండా రమేష్ ను అడ్డుకుని అతని చేతిలో కత్తి లాక్కొని ఉంటే ఇంత దారుణంగా జరిగిఉండేది కాదని పోలీసులు అంటున్నారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications