అదానిపై కొత్త ఆరోపణలు: సెబిపై బాంబు: స్టాక్ మార్కెట్స్ ఇన్వెస్టర్లు గజగజ
Hindenburg Research Report: దేశీయ స్టాక్ మార్కెట్ వ్యవహారాలను పర్యవేక్షించే సెక్యూరిటీ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాపై అమెరికాకు చెందిన ప్రముఖ రీసెర్చ్ సంస్థ హిండెన్‌బర్గ్.. బాంబు పేల్చింది. ఏకంగా సెబి ఛైర్‌పర్సన్ మాధవి బుచ్, ఆమె భర్త ధవల్ బుచ్‌ను లక్ష్యంగా చేసుకుంది.
దేశీయ పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానికి చెందిన అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీల్లో మాధవి, ధవల్ బుచ్ దంపతులకు భారీగా వాటాలు ఉన్నాయని తెలిపింది. పరోక్షంగా- అదానీ గ్రూప్ సంస్థల షేర్ల విలువల పెరగడానికి కారకులు అయ్యారని, వాటాలను కలిగివుండటం వల్ల వాళ్ల ఆస్తులనూ పెంచుకున్నారని ఆరోపించింది.

అదాని గ్రూప్‌కు చెందిన విదేశీ ఫండ్స్‌లల్లో మాధవి దంపతులకు అంతర్గత వాటాలు ఉన్నాయని స్పష్టం చేసింది. ప్రత్యేకించి బెర్ముడా, మారిషస్ ఫండ్లలో పెట్టుబడులు పెట్టినట్లు పేర్కొంది. దీనికి సంబంధించిన ఓ నివేదికను తన అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచింది హిండెన్‌బర్గ్ రిసెర్చ్ సంస్థ.
అదానీ గ్రూప్‌లో అనుమానిత ఆఫ్‌షోర్ షేర్ హోల్డర్లపై సెబి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీకి లబ్ది కలిగించేలా వ్యవహరించిన విషయాల్లో మాధవి బుచ్‌కు చిక్కులు తప్పకపోవచ్చని భావిస్తున్నామంటూ వ్యాఖ్యానించింది హిండెన్ బర్గ్ సంస్థ.
మాధబి బుచ్ దంపతులు తొలిసారిగా 2015 జూన్ 5వ తేదీన సింగపూర్‌లో ఐపీఈ ప్లస్ ఫండ్ 1లో తమ ఖాతాలను తెరిచినట్లు అంచనా వేసింది. ఇండియన్ బ్రోకరేజ్ కంపెనీ ఐఐఎఫ్ఎల్‌లో పెట్టుబడి పెట్టారని, అనంతరం వారి నికర ఆస్తుల విలువ 10 మిలియన్ డాలర్లకు పెరిగినట్లు పేర్కొంది.
తమ వాటాలతో 2013 మార్చి 27వ తేదీన సింగపూర్‌లో అగోరా పార్టనర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఓ కంపెనీని రిజిస్టర్ చేయించారని, దీన్ని బిజినెస్ అండ్ మేనేజ్‌మెంట్ కన్సల్టెన్సీగా అందులో పొందుపరిచినట్లు గుర్తించింది హిండెన్‌బర్గ్. ఆ సమయంలో ఆ కంపెనీ 2014 వార్షిక ఆదాయ రికార్డుల్లో మాధవి బచ్ వంద శాతం వాటాదారుగా ఉన్నట్లు తేలింది.
దీనిపై 2017 మార్చి 22వ తేదీన మారిషస్ ఫండ్ అడ్మినిస్ట్రేటర్ ట్రైడెంట్ ట్రస్ట్‌కి చెందిన ఓ విజిల్‌బ్లోయర్ నుంచి తమకు అందిన డాక్యుమెంట్ల ప్రకారం గ్లోబల్ డైనమిక్ ఆపార్చునిటీస్ ఫండ్‌లో మాధవి దంపతులకు పెట్టుబడులు ఉన్నట్లు గుర్తించామని, సెబి ఛైర్‌పర్సన్‌గా మాధవి బుచ్ నియామకానికి ముందు ధవల్ ఆమె పేరు మీద ఆస్తులను బదలాయించారని పేర్కొంది.
2022 మార్చి 1వ తేదీన సెబి ఛైర్‌పర్సన్‌గా ఆమె నియమితులు కాగా.. రెండు వారాల తరువాత అంటే అదే నెల 16వ తేదీన ఆమె అదాని గ్రూప్ కంపెనీల్లో తన పేరిట ఉన్న షేర్లు, అగోరా పార్టనర్స్ ప్రైవేట్ లిమిటెడ్ తన వంద శాతం వాటాలను భర్త పేరు మీద బదిలీ చేశారని హిండెన్‌బర్గ్ తెలిపింది.
ఈ ఆరోపణలను మాధవి బుచ్ దంపతులు తోసిపుచ్చారు. దీన్ని వ్యక్తిత్వ హననంగా అభివర్ణించారు. హిండెన్‌బర్గ్ సంస్థ తన తాజా నివేదికలో చేసినవన్నీ కూడా నిరాధారమైన ఆరోపణలని చెప్పారు. అందులో ఎలాంటి వాస్తవం లేదని వివరించారు. దీనిపై త్వరలోనే వివరణాత్మక ప్రకటన జారీ చేస్తామని వారు చెప్పారు.
హిండెన్‌బర్గ్ చేసిన తాజా ఆరోపణల ప్రభావం దేశీయ స్టాక మార్కెట్‌పై పడే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది. సోమవారం నాటి లావాదేవీల సందర్భంగా అదాని గ్రూప్ కంపెనీల షేర్లు, ఇతర సెగ్మెంట్స్‌కు చెందిన స్టాక్స్ నష్టాల్లో పడొచ్చని అంచనాలు వ్యక్తమౌతోన్నాయి. రిటైల్ ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలని విశ్లేషకులు సూచిస్తోన్నారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications