సెబీ కొరడా: గుజరాత్ సీఎం ప్యామిలీకి రూ. 15 లక్షల జరిమానా

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీపై సెబీ కొరడా ఝళిపించింది. ఆయన మోసపూరిత వ్యాపార కార్యకలాపాలకు పాల్పడినట్లు నిర్థారించి, రూ.15 లక్షలు జరిమానా విధించింది.

సెబీ 22 సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంది. వీటిలో గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీకి చెందిన లిస్టెడ్ కంపెనీ సారంగ్ కెమికల్స్ కూడా ఉంది. ఆయనకు చెందిన హిందూ అవిభాజ్య కుటుంబ సంస్థ సారంగ్ కెమికల్స్ వ్యాపారపరమైన అక్రమాలకు పాల్పడినట్లు నిర్థారించింది.

Sebi fines Gujarat CM Vijay Rupani’s family, 21 other entities for unfair trade practices

2011 జనవరి-జూన్ మధ్య కాలంలో ఈ అక్రమాలు జరిగినట్లు సెబీ వెబ్‌సైట్‌లో గత నెల 27న ప్రకటించింది. రూ.15 లక్షల జరిమానాను 45 రోజుల్లోగా చెల్లించాలని ఆదేశించింది. ఆయన గత ఏడాది ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన సంగతి తెలిసిందే.

ఎన్నికలు జరిగే సమయంలో విజయ్ రూపానీ కుటుంబంపై ఈ ఆరోపణలు రావడంతో విపక్షాలకు మంచి అవకాశం దొరికినట్టైందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Securities and Exchange Board of India has penalised 22 entities, including Gujarat Chief Vijay Rupani’s Hindu Undivided Family, for unfair trade practices

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి