కరుణానిధి నల్ల కళ్లద్దాల వెనుక అసలు కథేమిటో తెలుసా?, పసుపు శాలువా అందుకే!
Recommended Video

చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత డీఎంకే అధినేత కరుణానిధి ఎప్పుడూ కూడా కళ్లద్దాలు లేకుండా ఉండేవారు కాదు. ఆయన పెట్టుకునే నల్ల కళ్లజోళ్లు ప్రత్యేక ఆకర్షణగా ఉండేవి. అందుకే కరుణ చనిపోయిన తర్వాత కూడా ఆయన భౌతిక కాయానికి కళ్లజోళ్లను పెట్టే ఉంచారు.

అప్పట్లో ట్రెండ్ సెట్ చేశారు..
ఈ కళ్లద్దాలు ఇటీవల పెట్టుకున్నవేం కాదు.. ఎంజీఆర్ తోపాటు కరుణానిధి ఈ నల్ల కళ్లద్దాలను ఎన్నో ఏళ్ల నుంచి పెట్టుకున్నారు. వారిద్దరూ ఈ కళ్లద్దాలతో అప్పుడు ట్రెండ్ సెట్టర్‌గా నిలిచారు.

కరుణ కళ్లద్దాలు ఎందుకంటే..
అయితే, కరుణానిధి వాడిన కళ్లద్దాలకు మాత్రం ఓ బలమైన కారణమే ఉంది. 19600ల్లో కరుణానిధి కంటికి చిన్న గాయమైందట. దీంతో వైద్యులను సంప్రదించారు. ఆయనకు కంటి చికిత్స చేసిన వైద్యులు.. చికిత్స విజయవంతమైందని తెలిపారు. అయితే, కళ్లద్దాలను మాత్రం ఎప్పుడూ వాడాలని వైద్యులు కరుణకు సూచించారు. ఈ విషయాన్ని డీఎంకే నేత ఇళన్‌గోవన్ మీడియాకు వెల్లడించారు.

ఆ కళ్లద్దాలు జర్మనీ నుంచి..
సాధారణంగా కంటికి శస్త్రచికిత్స చేసినప్పుడు వైద్యులు నల్ల కళ్లద్దాలు వాడాలని సూచిస్తారు. కరుణానిధి కూడా కొంత కాలం వైద్యులు సూచించిన కళ్లద్దాలే వాడారు. ఆ తర్వాత నల్లటి స్టైలిష్‌గా ఈ కళ్లద్దాలను వాడటం మొదలుపెట్టారు కరుణానిధి. ఆ కళ్లద్దాలను కరుణానిధి కోసం ప్రత్యేకంగా జర్మనీ నుంచి తెప్పించినట్లు గతంలో ఓసారి చెన్నైలోని విజయ కంటి ఆస్పత్రి వైద్యులు మీడియా ద్వారా వెల్లడించారు.

46ఏళ్లపాటు నల్లకళ్లద్దాలే.. కానీ.., పసుపు శాలువా కూడా
అయితే, 46ఏళ్లపాటు నల్ల కళ్లద్దాలు వాడిని కరుణానిధి ఆ తర్వాత వాటి స్థానంలో సాధారణ కళ్లద్దాలను వాడటం ప్రారంభించారు. కరుణానిధి ఎప్పుడూ తనపై పసుపు రంగు శాలువా కూడా వేసుకునేవారు. పసుపు ఆకర్షణగా ఉంటుందనే ఆయన ఈ రంగు శాలువను వాడేవారని తెలిసింది.
-
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి..












Click it and Unblock the Notifications