ఈద్ మిలాద్ ఊరేగింపులో ఏం జరిగింది ?, దాడులు, ప్రతిదాడులు, మాజీ సీఎం !

బెంగళూరు/శివమొగ్గ: ఈద్ మిలాద్ (Eid Milad) ఊరేగింపు సందర్భంగా రాళ్ల దాడి కారణంగా కర్ణాటకలోని శివమొగ్గ (Shivmogga) నగరం లో ఉద్రిక్త పరిస్థితులు ఎదురైనాయి. ఈ ఘటనపై కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీపై బీజేపీ మండిపడింది. ఈ విషయంలో, X (ట్వీట్) లో కాంగ్రెస్‌పై బీజేపీ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసింది. జిహాదీలు శివమొగ్గలొ వీధుల్లో కత్తులు, ఆయుధాలతో తిరుగుతున్నారని బీజేపీ ఆరోపించింది.

ఇంత జరుగుతున్నా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య (siddaramaiah)పరారీలో ఉన్నారని బీజేపీ ఆరోపించింది. కర్ణాటకలో మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీని వల్ల హిందువులను భయభ్రాంతులకు గురి చేసేందుకు జిహాదీ సంస్థలు ఎలాంటి చర్యలకు భయపడకుండా ఆయుధాలు చేతపట్టుకుని తిరుగుతున్నాయని బీజేపీ ఆరోపించింది.

Section 144 enforced in Shivmogga

కాంగ్రెస్ పార్టీ జిహాదీలకు (Eid Milad) లొంగిపోయింది అని బీజేపీ ఎక్స్ (ట్వీట్) లో రాసింది. అంతేకాకుండా, కర్ణాటకలో కాంగ్రెస్ (congress)ప్రభుత్వం జిహాదీ ప్రభుత్వం తప్ప మరేమీ కాకపోవడం దురదృష్టకరమని బీజేపీ ఎక్స్ (ట్వీట్)లో కాంగ్రెస్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. శివమొగ్గలో హిందువులపై దాడి జరిగిందని, అయినా సిద్దరామయ్య (siddaramaiah) ప్రభుత్వం ఎవ్వరి మీద చర్చలు తీసుకోలేదని బీజేపీ ఆరోపించింది.

ఇంత జరిగినా సిద్ధరామయ్య ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, హిందువులకు రక్షణ లేదని బీజేపీ (BJP) ఆరోపిస్తోంది. ఆదివారం శివమొగ్గలో (Shivmogga) ఈద్‌మిలాద్‌ (Eid Milad) ఊరేగింపు సందర్భంగా రాళ్ల దాడి జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆదివారం సాయంత్రం రాగిగుడ్డ ప్రాంతంలోని శ్రీ శనేశ్వర దేవాలయం, చుట్టుపక్కల ప్రాంతాల్లో రాళ్లదాడి జరగగా, గాయపడిన ఐదుగురిని పోలీసులు రక్షించారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు కూడా గాయపడ్డారు.

Section 144

బాధిత ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పోలీసులు 144 సెక్షన్‌ను అమలు చేసి 30 మందికి పైగా అరెస్టు చేశారు. ఈద్ మిలాద్ (Eid Milad) ఊరేగింపు సందర్భంగా రాళ్లదాడి జరిగిందని ఆరోపిస్తూ, ఆగ్రహించిన ప్రజలు ఇతర ప్రాంతాల్లోకి ప్రవేశించి దండయాత్ర చేశారు. ఓ వర్గం వాళ్లు ఆదివారం అర్థరాత్రి విసిరిన రాళ్లతో ఇళ్ల కిటికీలు, తలుపులు పగలడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

శివమొగ్గలోని (Shivmogga) రాగిగుడ్డ సమీపంలోని శాంతినగర్‌ నుంచి ఈద్ మిలాద్ (Eid Milad) ఊరేగింపు ప్రారంభమై ఎనిమిదో క్రాస్‌ వద్దకు రాగానే ఊరేగింపుపై రాళ్లు రువ్వారని ముస్లింలు ఆరోపించారు. ఈ సమయంలో సామాన్య ప్రజలు నివసించే ప్రాంతాల్లోకి చొరబడిన దుండగులు ఇళ్లపై రాళ్లు రువ్వడం ప్రారంభించారు. దీంతో కొన్ని ఇళ్ల అద్దాలు దెబ్బతిన్నాయి.

అక్టోబరు 1వ తేదీన గణపతి విసర్జనకు ముందు ఉత్సవం, ఈద్ మిలాద్ (Eid Milad) ఊరేగింపు ఒకే రోజు రావడంతో గందరగోళం నెలకొనకుండా అక్టోబరు 1న ఈద్ మిలాద్ ఊరేగింపు నిర్వహించాలని జిల్లా యంత్రాంగం, పోలీసు శాఖ శాంతిసభకు ఆదేశాలు జారీ చేసింది. అందుకు తగ్గట్టుగానే ఆదివారం ఊరేగింపుకు శివమొగ్గ (Shivmogga) నగరాన్ని ముస్తాబు చేశారు.

ఈ సమయంలో రాగిగుడ్డ ప్రధాన రహదారిపై టిప్పు సుల్తాన్ కటౌట్ ఏర్పాటు చేయగా, ఆయన కాళ్ల వద్ద కుంకుమ, కాషాయ వస్త్రం ధరించిన వ్యక్తి కుర్చున్నట్లు ఓ చిత్రాన్ని (Eid Milad) పెట్టారు. దీనిపై జిల్లా అధికార యంత్రాంగానికి ఫిర్యాదు చేశారు. వెంటనే ఎస్పీ (Shivmogga) నేతృత్వంలో ఆ భాగానికి రంగులు వేశారు. గంటల వ్యవధిలోనే ఆ తెల్లటి పెయింట్‌పై ఎరుపు రంగులో 'టిప్పు షేర్' అని రాసి ఉంది. ఇన్ని పరిణామాల మధ్య రాళ్ల దాడి జరిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+