హై అలర్ట్: మోడీ, ప్రణబ్‌లతో పాటు సోనియా, రాహుల్‌కు భద్రత పెంపు
న్యూఢిల్లీ: ప్రధాని మోడీ, రాష్ట్రపతి ప్రణబ్, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి భద్రతను పెంచాలని కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయించారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాదుల స్థావరాల అనంతరం సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్న సంగతి తెలిసిందే.
ఎల్ఓసీకి సమీపాన పాకిస్థాన్‌లో దాదాపు వంద మందికి పైగా ఉగ్రవాదులు మాటువేశారని జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ ప్రధాని మోడీకి తెలియజేశారు. నిఘావర్గాల సమాచారాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉగ్రవాదులు ఏ క్షణంలోనైనా భారత్‌లోకి చొరబడి దాడులు చేసే అవకాశం ఉన్నారన్నారు.

భారత్ చేసిన సర్జికల్ స్ట్రయిక్స్‌కు ప్రతీకారంగా భారత్‌లో విధ్వంసం సృష్టించేందుకు, భారత రాజకీయ నేతలను టార్గెట్ చేసేందుకు పాక్ తన స్లీపర్ సెల్స్ ద్వారా యత్నిస్తున్నట్లు ఇంటలిజెన్స్ వర్గాల నుంచి సేకరించిన సమాచారం మేరకు దోవల్ ఓ నివేదికను మోడీకి సమర్పించినట్టు అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి.
ఇందులో భాగంగా ప్రధాని మోడీ నివాసం వద్ద కూడా భద్రతను పెంచుతారు. దేశంలోని ఇతర వీవీఐపీల కూడా భద్రతను కూడా పెంచుతున్నారు. బుధవారం ప్రధాని మోడీ అధ్యక్షతన కేబినెట్ భద్రత కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హోం, రక్షణ, విదేశీ వ్యవహారాల శాఖల మంత్రులతో పాటు అజిత్ దోవల్ కూడా హాజరయ్యారు.












Click it and Unblock the Notifications