కొత్త పార్లమెంట్ భవనం వద్ద పంచాయతీ
న్యూఢిల్లీ: కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి చెందిన లోక్‌సభ సభ్యుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల వ్యవహారం తీవ్ర రూపాన్ని దాల్చింది. ఆయనపై చర్యలు తీసుకోవడానికి బీజేపీ అధిష్ఠానం సిద్ధంగా లేదు. రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్‌గా వ్యవహరిస్తోన్న బ్రిజ్ భూషణ్‌పై సస్పెన్షన్ వేటు వేయడానికి కూడా బీజేపీ అధినాయకత్వం ముందుకు రావట్లేదు. దీనిపై దేశవ్యాప్తంగా దుమారం చెలరేగుతోంది.
ఉత్తరప్రదేశ్‌లోని కైసర్‌గంజ్ లోక్‌సభకు ప్రాతినిథ్యాన్నివహిస్తోన్నారు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్. వరుసగా మూడుసార్లు ఆయన ఇదే నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఆయనను రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా నామినేట్ చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ క్రమంలో మహిళా రెజ్లర్లపై లైంగిక దాడులకు పాల్పడ్డారనే ఆరోపణలు బ్రిజ్ భూషణ్‌పై వెల్లువెత్తాయి.

Delhi | Security heightened at Jantar Mantar ahead of protesting wrestlers' march towards the new Parliament House. They have decided to hold a women's Maha Panchayat in front of the new Parliament pic.twitter.com/uvGknPHirv
— ANI (@ANI) May 28, 2023
ఆయనపై తక్షణ చర్యలు తీసుకోవాలంటూ భారత మహిళా రెజ్లర్లు రోడ్డెక్కారు. రోజుల తరబడి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన కొనసాగిస్తోన్నారు. వినేష్ ఫొగట్, బజరంగ్ పునియా, సాక్షి మాలిక్, సంగీత ఫొగట్, సత్యవ్రత్ కడియన్, సోమ్‌వీర్ రాఠీ, జితేందర్ కిన్హా తమ నిరసనలను కొనసాగిస్తోన్నారు. దీని తీవ్రత రోజురోజుకూ పెరుగుతూ వస్తోంది.
#WATCH | Security tightened near Singhu border area; Khap panchayat leaders, farmers to join protesting wrestlers' march to new parliament house in Delhi today. pic.twitter.com/X3lvACK99n
— ANI (@ANI) May 28, 2023
తమ నిరసనలో భాగంగా ఇవ్వాళ ఢిల్లీలో ప్రారంభం కానున్న కొత్త పార్లమెంట్ భవనం వద్ద మహిళా ఖాఫ్ పంచాయతీని నిర్వహించబోతోన్నట్లు ప్రకటించారు వినేష్ ఫోగట్. ఇందులో పాల్గొనడానికి పంజాబ్, హర్యానా, ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు, రైతులు ఢిల్లీకి చేరుకోనున్నారు. జంతర్ మంతర్ నుంచి కొత్త పార్లమెంట్ భవనం వరకు ర్యాలీగా తరలివెళ్లాలని నిర్ణయించుకున్నారు.
#WATCH | Security tightened in Tikri border as Khap Panchayat leaders and farmers are said to join protesting wrestlers' march towards the new Parliament House in Delhi today. pic.twitter.com/jGsrZxUmvz
— ANI (@ANI) May 28, 2023
ఈ నేపథ్యంలో ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రతను కల్పించారు. కేంద్రీయ రిజర్వ్ పోలీస్ బలగాలను మోహరింపజేశారు. హర్యానా, ఉత్తరప్రదేశ్ వైపు నుంచి ఢిల్లీలోకి ప్రవేశించే అవకాశం ఉన్నందున టిక్రీ, సింగూ, అంబాలా సరిహద్దుల వద్ద పహారా కాస్తోన్న పోలీసుల సంఖ్యను రెట్టింపు చేశారు. బ్యారికేడ్లను అమర్చారు. వాహనాలన్నింటినీ తనిఖీ చేసిన తరువాత ఢిల్లీలోనికి ప్రవేశించడానికి అనుమతి ఇస్తోన్నారు.
అటు జంతర్ మంతర్ వద్ద కూడా భద్రత మరింత పెరిగింది. జంతర్ మంతర్ ప్రాంతం మొత్తాన్నీ పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. కొత్తవారినెవరినీ అక్కడికి వెళ్లనివ్వట్లేదు. నిరసనలో ఉన్న వారు బయటికి రాకుండా అన్ని మార్గాలనూ మూసివేశారు. ఖాఫ్ పంచాయతీని నిర్వహించి తీరుతామంటూ మహిళా రెజ్లర్లు తేల్చి చెబుతున్న నేపథ్యంలో- జంతర్ మంతర్ నుంచి కొత్త పార్లమెంట్ భవనం దారి పొడవునా పోలీసులను మోహరింపజేశారు.












Click it and Unblock the Notifications