బేరసారాల ఎఫెక్ట్: 24గంటల్లో బలనిరూపణకు సుప్రీంకోర్టుకి శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్, ఆదివారం విచారణ
హైదరాబాద్: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేయడంపై శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు శనివారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అంతేగాక, మహారాష్ట్ర గవర్నర్ తీరుకు వ్యతిరేకంగా రిట్ పిటిషన్ కూడా దాఖలు చేసినట్లు శివసేనకు చెందిన ఓ నేత శనివారం వెల్లడించారు. మూడు పార్టీలు దాఖలు చేసిన పిటిషన్‌పై ఆదివారం ఉదయం 11.30గంటలకు విచారించే అవకాశం ఉందని ఆ పార్టీల తరపు న్యాయవాది సునీల్ ఫెర్నాండేజ్ తెలిపారు.
Supreme Court to hear on tomorrow at 11.30 am the joint plea of Shiv Sena, Nationalist Congress Party and Indian National Congress against the decision of Maharashtra Governor inviting Devendra Fadnavis to form the government on November 23. pic.twitter.com/Be4lMgmSNH
— ANI (@ANI) November 23, 2019

బేరసారాలకు అవకాశం ఉంది.. అందుకే 24గంటల్లో..
బేరసారాలు జరిగే అవకాశం ఉండటంతో అసెంబ్లీలో బలనిరూపణను 24 గంటల్లోనే జరపాలని శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు తమ పిటిషన్లలో సుప్రీంకోర్టును కోరారు. కాగా, మహారాష్ట్ర గవర్నర్ నవంబర్ 30న సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను బలనిరూపణ చేసుకోవాలని స్పస్టం చేశారు.

ఉద్ధవ్ అనుకుంటే.. ఫడ్నవీస్ సీఎం అయ్యారు
ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల మద్దతుతో శనివారం ఉదయం శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే ముఖ్యమంత్రి పదవి చేపడతారని అంతా అనుకున్నారు. అయితే, శనివారం తెల్లవారేసరికి పరిణామాలన్నీ మారిపోయాయి. ఎన్సీపీ నేత అజిత్ పవార్ పలువురు ఎమ్మెల్యేలతో బీజేపీకి మద్దతు ఇచ్చారు. దీంతో శనివారం ఉదయం దేవేంద్ర ఫడ్నవీస్ సీఎంగా, అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు.

అజిత్ పవార్‌పై వేటు
ఈ క్రమంలో రాష్ట్రపతి పాలనను మహారాష్ట్రలో ఎత్తివేస్తున్నట్లు గవర్నర్ ప్రకటించారు. అయితే, అజిత్ పవార్ తనకు తెలియకుండానే ఇదంతా చేశారని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ స్పష్టం చేశారు. అంతేగాక, అజిత్ పవార్ ను పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. ఆయనతో కేవలం 10-12మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారని, మిగితా ఎమ్మెల్యేలతో తనతోనే ఉన్నారని శరద్ పవార్ స్పష్టం చేశారు. అంతేగాక, ఎన్సీపీ లేజిస్లేటివ్ పార్టీ నేత పదవి నుంచి కూడా తొలగించారు. అజిత్ పవార్ బీజేపీతో కలిసి శివసేనకు వెన్నుపోటు పొడిచారని శివసేన నేత సంజయ్ రౌత్ తీవ్రంగా విమర్శించారు.

ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిలో..
ఇప్పటికే పలువురు ఎన్సీపీ ఎమ్మెల్యేలు శరద్ పవార్ వద్దకు చేరుకోవడం గమనార్హం. అజిత్ పవార్ తమకు ఫోన్ చేసి రాజ్‌భవన్‌కు రమ్మనడంతో వెళ్లామని, అక్కడ ఏం జరుగుతుందో తమకు తెలియని వారు చెప్పారు. కాగా, ప్రస్తుతం అజిత్ పవార్ వద్ద 10-15 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు తెలుస్తోంది. వారిని ఢిల్లీ, గుజరాత్‌లకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. నవంబర్ 30న బల నిరూపణ ఉండటంతో అన్ని పార్టీలు అప్రమత్తమయ్యాయి. తమ తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు చర్యలు చేపడుతున్నాయి. శివసేన, కాంగ్రెస్ పార్టీలు కూడా తమ ఎమ్మెల్యేలను అత్యవసరంగా పిలిపించి సమావేశాలు నిర్వహిస్తున్నాయి. బేరసారాలకు అవకాశం ఉండటంతో అన్ని పార్టీలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి.












Click it and Unblock the Notifications