వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత నూతన అటార్నీ జనరల్‌గా సీనియర్ న్యాయవాది ఆర్ వెంకటరమణి నియామకం: ఎవరీయన?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత నూతన అటార్నీ జనరల్‌గా సీనియర్ న్యాయవాది ఆర్ వెంకటరమణిని మూడేళ్ల కాలానికి నియమించారు. ఈ మేరకు వార్తా సంస్థ ఏఎన్ఐ నివేదించింది. కేకే వేణుగోపాల్ తర్వాత ఆయన కొత్త ఏజీగా బాధ్యతలు చేపట్టనున్నారు.

Senior Advocate R Venkataramani Appointed As New Attorney General Of India

న్యాయ, న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు కార్యాలయం ట్వీట్‌లో నియామకాన్ని ధృవీకరించింది. "గౌరవనీయ రాష్ట్రపతి ఆర్. వెంకటరమణి, సీనియర్ అడ్వకేట్‌ను భారతదేశానికి అటార్నీ జనరల్‌గా అక్టోబర్ 1, 2022 నుంచి నియమించడం పట్ల సంతోషిస్తున్నాము" అని పేర్కొంది. ఇందకుముందు, మరో సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ.. అటార్నీ జనరల్ బాధ్యతను చేపట్టేందుకు నిరాకరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వెంకటరమణిని కొత్త అటార్నీ జనరల్‌గా నియామకం జరిగింది.

ఎవరీ ఆర్ వెంకటరమణి ?

వెంకటరమణి సుప్రీంకోర్టు న్యాయవాదిగా 42 ఏళ్లుగా ప్రాక్టీస్ చేస్తున్నారు. జూలై 1977లో, వెంకటరమణి తమిళనాడు బార్ కౌన్సిల్‌లో నమోదు చేసుకున్నారు. 1979లో, సీనియర్ న్యాయవాది పీపీ రావుతో కలిసి, సుప్రీంకోర్టు ఛాంబర్‌లో చేరారు. 1982లో ఆయన సుప్రీంకోర్టులో స్వతంత్ర అభ్యాసాన్ని స్థాపించారు.

1997లో భారత అత్యున్నత న్యాయస్థానం ఆయనను సీనియర్ న్యాయవాదిగా నియమించింది. 2010లో లా కమిషన్ ఆఫ్ ఇండియాకు నియమితుడయ్యారు. 2013లో రెండోసారి నియమితులయ్యారు.

ఆయన రాజ్యాంగ చట్టం, మధ్యవర్తిత్వ చట్టం, పరోక్ష పన్ను చట్టం, కార్పొరేట్, సెక్యూరిటీల చట్టం, పర్యావరణ చట్టం, విద్యా చట్టం, భూమి చట్టం, క్రిమినల్ చట్టం, మానవ హక్కుల చట్టం, వినియోగదారుల చట్టం, సేవా చట్టంతో సహా అనేక చట్ట రంగాలలో వాదించారు.

వెంకటరమణ అనేక రాష్ట్ర ప్రభుత్వాలు, విశ్వవిద్యాలయాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల తరపున సుప్రీంకోర్టు, హైకోర్టులలో వాదనలు వినిపించారు. 2004, 2010 మధ్య, ఆయన సుప్రీంకోర్టు, హైకోర్టులలో భారత ప్రభుత్వ వివిధ విభాగాలకు ప్రత్యేక సీనియర్ న్యాయవాదిగా పనిచేశారు. కోర్టు ఉద్యోగుల సేవా పరిస్థితులకు సంబంధించిన విషయాలలో సుప్రీంకోర్టు న్యాయవాదిగా కూడా పనిచేశారు.

1988 నుంచి ఆయన బెంగుళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీతో అకడమిక్ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ప్రస్తుతం అనేక న్యాయ పాఠశాలల్లో విద్యా కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు.

English summary
Senior Advocate R Venkataramani Appointed As New Attorney General Of India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X