వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Ayodhya verdict:అయోధ్య కేసును వాదించిన అడ్వొకేట్ రాజీవ్ ధవన్ కు బెదిరింపులు: రక్షణ కావాలంటూ పిటీషన్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అయోధ్యలో రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదంపై సుప్రీంకోర్టు మరి కొన్ని గంటల్లో తీర్పు వెలువడబోతోంది. ఈ పరిస్థితుల్లో తనకు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని, రక్షణ కల్పించాలని కోరుతూ సుప్రీంకోర్టు సీనియర్ అడ్వొకేట్ రాజీవ్ ధవన్ పిటీషన్ దాఖలు చేశారు.

అయోధ్య భూవివాదంపై తీర్పు వెలువడటానికి కొన్ని గంటల ముందు ఆయన ఈ పిటీషన్ దాఖలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రామజన్మభూమి-బాబ్రీ మసీదు కేసులో ముస్లింల తరఫున రాజీవ్ ధవన్ వాదనలు వినిపించారు. బాబ్రీ మసీదు స్థలం ముస్లిం వక్ఫ్ బోర్డుకు చెందుతుందని ఆయన వాదనలు కొనసాగించారు.

Ayodhya Verdict: 134ఏళ్లుగా నడుస్తున్న చరిత్ర...మలుపులు, తీర్పులు..నేటితో ముగింపుAyodhya Verdict: 134ఏళ్లుగా నడుస్తున్న చరిత్ర...మలుపులు, తీర్పులు..నేటితో ముగింపు

రామజన్మభూమికి వ్యతిరేకంగా వాదనలను వినిపిస్తున్నందున చాలాకాలం నుంచీ తనకు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని రాజీవ్ ధవన్ చెప్పుకొచ్చారు. ఈ సారి ఆయన లిఖితపూరకంగా సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.

Senior Advocate Rajeev Dhavan files contempt plea over threat in Supreme Court,

చెన్నైకి చెందిన ఓ ప్రొఫెసర్ తనను బెదిరిస్తున్నారని అన్నారు. ఇదివరకు కూడా అదే ప్రొఫెసర్ నుంచి తనకు బెదిరింపులు వచ్చాయని, ఈ విషయంలో బహిర్గతం కావడంతో ఆయన క్షమాపణ చెప్పారని అన్నారు. తీర్పు వెలువడబోతున్న పరిస్థితుల్లో మరోసారి ఆ ప్రొఫెసర్ ఫోన్ చేసి బెదిరించారని రాజీవ్ ధవన్ తన పిటీషన్ లో పేర్కొన్నారు. తనకు రక్షణ కల్పించాలని కోరారు.

రామజన్మభూమి-బాబ్రీ మసీదు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టులో తుది విచారణ కొనసాగుతున్న సమయంలో హిందూ మహాసభ తరపు న్యాయవాది వికాస్ సింగ్ చేతుల్లో ఉన్న అయోధ్య రివిజిటెడ్ పుస్తకాన్ని, కొన్ని మ్యాపులను రాజీవ్ ధవన్ చించేసిన విషయం తెలిసిందే.

రిటైర్డ్ ఐపీఎస్ అధికారి కునాల్ కిశోర్ రాసిన పుస్తకం అది. అందులోని కొన్ని అంశాలు వివాదాస్పదంగా ఉన్నాయని ఇలాంటి పుస్తకాల మీద ఆధారపడి సుప్రీంకోర్టు చారిత్రాత్మక విషయాలపై ఓ అభిప్రాయానికి రాకూడదంటూ ఆయన వాదనలను వినిపించారు. తన వాదనల తీరు అభ్యంతరకరంగా ఉందంటూ చెన్నై ప్రొఫెసర్ తనను బెదిరిస్తున్నారని, రక్షణ కల్పించాలని కోరారు. సుప్రీంకోర్టు దీన్ని విచారణకు స్వీకరించింది.

English summary
Senior Advocate Rajeev Dhavan files contempt plea over threat; seeks suo motu contempt proceedings against a Chennai-based professor who he claimed threatened him against appearing for Muslim parties in the Ayodhya case, reports.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X