అయోధ్య కోసం పోరాటం, ఎల్ కే అద్వాని, జోషి ఎక్కడ ?, ఎందుకు రాలేదంటే ?, అందుకేనా !

అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవంలో బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ పాల్గొనడం లేదని మొదటి నుంచి వార్తలు వచ్చాయి. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలోని రామమందిరంలో నేడు శ్రీరాముడి లాల్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. ఈ గ్రాండ్ ఫంక్షన్‌కు ఎల్‌కే అద్వానీతో సహా పలువురు బీజేపీ సీనియర్ నాయకులకు, రాజకీయ ప్రముఖులకు ఆహ్వానం అందింది.

అయితే ఈ కార్యక్రమంలో ఎల్‌కే అద్వానీ పాల్గొనడం లేదని వార్తలు వచ్చాయి. చివరి వరకు అద్వాని ఈ కార్యక్రమానికి హాజరు అవుతారని ప్రచారం జరిగింది ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామమందిర ఉద్యమంలో అగ్రభాగాన నిలిచిన బీజేపీ సీనియర్‌ నేత లాల్‌కృష్ణ అద్వానీ తీవ్ర చలి తీవ్రత కారణంగా సోమవారం జరిగే రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనకూడదని నిర్ణయించుకున్నట్లు ఆయన సన్నిహితులు సమాచారం ఇచ్చారు. అయితే ఎల్ కే అద్వాని అయోధ్యలో జరిగిన కార్యక్రమానికి హాజరుకాకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

 Senior BJP leader LK Advani did not attend the opening ceremony of Ayodhya Ram Mandir

96 ఏళ్ల సీనియర్‌ బీజేపీ నేత హాజరుపై పలు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అంతకుముందు, శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రం, రామమందిర్ ట్రస్ట్ నిర్వహకులు ఎల్‌కె అద్వానీ, ఆయన సహచరుడు మురళీ మనోహర్ జోషి వారి ఆరోగ్యం కారణాలు, వయస్సు మీదపడిన దృష్ట్యా శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనలేదని వారి సన్నిహిత వర్గాలు తెలిపాయి ఈ నేతలిద్దరూ సీనియర్లని, వారి వయస్సును దృష్టిలో ఉంచుకుని కార్యక్రమానికి రావద్దని కోరామని బీజేపీకి చెందిన ఓ సీనియర్ నాయకుడు తెలిపారు.

అయోధ్య శ్రీరామ టెంపుల్ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఎల్‌కే అద్వానీ రామమందిర ప్రారంభోత్సవానికి హాజరవుతారని ఇటీవల విశ్వహిందూ పరిషత్ నాయకుడు ఒకరు ఏఎన్ఐ వార్తా సంస్థకు తెలిపారు. బీజేపీ సైనికుడు ఎల్ కే అద్వానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు, వైద్య సదుపాయాలు కల్పిస్తామని, రామమందిర ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొంటారని వీహెచ్‌పీ అంతర్జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్ కుమార్ ఇటీవల మీడియాకు చెప్పారు.

 Senior BJP leader LK Advani did not attend the opening ceremony of Ayodhya Ram Mandir

అంతేకాకుండా అయోధ్యలో జరిగే రామమందిర ప్రారంభోత్సవానికి హాజరు కావాలని ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్ జోషిలను వీహెచ్‌పీ గత డిసెంబర్ నెలలోనే ఆహ్వానించింది. అయితే ఈరోజు జరిగిన రామమందిర ప్రారంభోత్సవానికి ఎల్ కే అద్వాని రాలేరని ఆయన సన్నిహితులు సమాచారం అందించారు. మొత్తం మీద అయోధ్య రామ మందిరం కోసం ప్రధాని మోదీ కంటే ముందు నుంచి పోరాటం చేసిన బీజేపీకి చెందిన ఇద్దరు సీనియర్ నాయకులు ఆ కార్యక్రమానికి హాజరుకాకపోవడం హాట్ టాపిక్ అయ్యింది. అయోధ్యలో శ్రీరాముడి ఆలయాన్ని సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+