గురి చూసి దెబ్బ కొట్టిన మేడమ్, ఎంపీ సీటు ఇవ్వలేదని ఎమ్మెల్సీకి రాజీనామా, తరువాత ఏంటి?
బీజేపీ సీనియర్ నాయకురాలు, శాసనమండలి సభ్యురాలు తేజస్విని గౌడ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో మేడమ్ తేజస్విని గౌడ మళ్లీ కాంగ్రెస్‌లో చేరతారా ? అనే ప్రశ్న తలెత్తుతోంది. తేజస్విని గౌడ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చెయ్యడం కర్ణాటక రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది. లోక్‌సభ ఎన్నికలకు ముందు కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో అనేక మార్పులు కనిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే రాజీనామాలు చేసి పార్టీలు మారే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నది. ఈ వరుసలో బీజేపీ ఎమ్మెల్సీ తేజస్విని గౌడ కూడా చేరారు. తేజస్విని గౌడ ఈరోజు (బుధవారం) ఆమె రాజీనామా లేఖను కర్ణాటక శాసనమండలి స్పీకర్ బసవరాజ్ హొరట్టికి సమర్పించారు. ఎమ్మెల్సీగా తేజస్విని పదవీకాలం జూన్ 24వ తేదీ వరకు ఉంది. అయితే పదవీ కాలానికి ముందే స్వచ్ఛందంగా తేజస్విని గౌడ రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.

తేజస్విని గౌడ రాజీనామాపై కర్ణాటక శాసన సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, బీజేపీ సీనియర్ నాయకుడు ఆర్.అశోక్ మాట్లాడుతూ తేజస్విని గౌడ్ మా పార్టీలోకి వచ్చి ఎమ్మెల్సీ అయ్యారని గుర్తు చేశారు. తేజస్విని గౌడ పదవీకాలం ఇంకా పూర్తి కాలేదని, మరో నెలలో ఆమె పదవి కాలం పూర్తి అవుతుందని అశోక్ అన్నారు. అయితే అన్ని పదవులు, అడిగిన సీట్లు ఇస్తే బీజేపీ చాలా మంచి పార్టీ, అలా చెయ్యకపోతే బీజేపీ చెడ్డపార్టీ అని చాలా మంది అనుకుంటున్నారని ఆర్ అశోక్ అన్నారు.
ఇలాంటి మనస్తత్వం ఉన్న వాళ్లు చాలా మంది ఉన్నారని, వాళ్ల పద్దతి సరిగా లేదని. అర్ అశోక్ అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి వాటిని బీజేపీ ఆమోదించదని అశోక్ అన్నారు. రాజీనామా చేసిన తర్వాత కూడా తేజస్విని గౌడ తదుపరి ఎత్తుగడపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
గత ఇరవై ఏళ్లుగా రాజకీయాల్లో చురుకుగా ఉన్న తేజస్విని గౌడ 2004లో కాంగ్రెస్ టికెట్‌పై కనకపుర ప్రస్తుతం బెంగళూరు రూరల్ లోక్‌సభ నియోజకవర్గం అంటే గతంలో కనకపుర లోక్ సభ నియోజక వర్గం నుంచి పోటీ చేసి మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడను ఓడించి దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు.

ఎంపీగా పదవి కాలం పూర్తి అయిన తర్వాత తేజస్విని గౌడ బీజేపీలో చేరారు. ఈసారి మైసూరు-కొడగు లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసే ఆలోచనతో తనకు ఎంపీ టిక్కెట్ ఇవ్వాలని తేజస్విని గౌడ బీజేపీ హైకమాండ్ కు మనవి చేశారు.
అయితే తేజస్విని గౌడకు టిక్కెట్ ఇవ్వడానికి నిరాకరించిన బీజేపీ హైకమాండ్ మైసూరు ఎంపీ టిక్కెట్ రాజవంశీయులు యదువీర్ కృష్ణదత్త చామరాజ వడయార్‌కు ఇచ్చారు. ఆ తర్వాత తేజస్విని గౌడ బీజేపీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. దీంతో తేజస్విని గౌడ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తేజస్విని గౌడ మళ్లీ కాంగ్రెస్‌లో చేరతారనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications