సీఎం విజయ్‌కి హైకోర్టు బిగ్ షాక్.. ఆ ఉద్యోగాలు రద్దు

తమిళనాడు సీఎం విజయ్ కు న్యాయస్థానంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కరూర్ తొక్కిసలాట ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు కారుణ్య ప్రాతిపదికన ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తూ ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మద్రాస్ హైకోర్టు రద్దు చేసింది. సేవ, ఆదుకునే హృదయంతో ఇచ్చిన నియామకాలు అయినప్పటికీ.. రాజ్యాంగబద్ధమైన ప్రక్రియను పక్కనబెట్టి ఉద్యోగాలు కేటాయించడం సరికాదని న్యాయస్థానం స్పష్టం చేయడంతో అధికార వర్గాల్లో తీవ్ర కలకలం రేగుతోంది.

గత ఏడాది సెప్టెంబర్‌లో కరూర్‌లో టీవీకే పార్టీ నిర్వహించిన భారీ బహిరంగ సభ తీవ్ర విషాదాంతంగా మారింది. ప్రజలు భారీగా తరలిరావడం, అక్కడ కనీస వసతుల కొరత ఏర్పడటంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘోర ప్రమాదంలో చిన్న పిల్లలతో సహా దాదాపు 41 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై తీవ్ర రాజకీయ వివాదం చెలరేగింది. భద్రతా లోపాలు, సమయపాలన పాటించకపోవడమే దానికి కారణమని పోలీసులు ఆరోపించగా.. ప్రతిపక్షాల కుట్ర ఉందని అధికార వర్గాలు ఖండించాయి. ఆ తర్వాత ఈ కేసు తీవ్రతను బట్టి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విచారణ సీబీఐకి అప్పగించింది.

Madras High Court Cancels TVK Govt Jobs for Karur Stampede Victims Big Setback for CM Vijay

బాధితులకు చేదోడుగా.. సర్కార్ ఉద్యోగాల అందజేత!

బాధిత కుటుంబాలకు ఆర్థికంగా నిలదొక్కుకునే వెసులుబాటు కల్పించాలనే ఉద్దేశంతో ఇటీవల సీఎం విజయ్ స్వయంగా కరూర్ పర్యటించారు. తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన 32 మందికి సంబంధించిన వారసులకు కారుణ్య నియామకాల కింద ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. ప్రభుత్వం నుంచి అందుతున్న ఈ సహాయం ఆ కుటుంబాలకు ఎంతో కొంత ఊరటనిస్తుందని భావించారు. అయితే, నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగాలు ఇస్తున్నారంటూ ప్రతిపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.

కరూర్ బాధితులకు అండగా సీఎం విజయ్.. మాట నిలబెట్టుకొని ఉద్యోగాలు !!
కరూర్ బాధితులకు అండగా సీఎం విజయ్.. మాట నిలబెట్టుకొని ఉద్యోగాలు !!

ప్రతిపక్షాల విమర్శలు.. నిబంధనల ఉల్లంఘనేనా?

ఈ ఉద్యోగాల కేటాయింపుపై ప్రధాన ప్రతిపక్షమైన ఏఐఏడీఎంకే ఘాటుగా స్పందించింది. ఏళ్ల తరబడి కష్టపడి తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న లక్షలాది మంది నిరుద్యోగ యువతకు ఇది తీవ్ర ద్రోహమని ఆరోపించింది. రాజకీయ కారణాలతో లేదా సానుభూతితో చట్టబద్ధమైన రిక్రూట్‌మెంట్ నిబంధనలను పక్కనబెట్టి ప్రభుత్వ ఉద్యోగాలు కట్టబెట్టడం సరికాదని, ఇది రాష్ట్రంలో తప్పుడు సంప్రదాయానికి దారితీస్తుందని ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పించారు.

సీఎం విజయ్ లైన్ దాటిన ఎమ్మెల్యే!.. ఆ ఒక్క 'రీల్' తెచ్చిన ముప్పు!
సీఎం విజయ్ లైన్ దాటిన ఎమ్మెల్యే!.. ఆ ఒక్క 'రీల్' తెచ్చిన ముప్పు!

హైకోర్టు తీర్పు.. భవిష్యత్తు కార్యాచరణ ఏంటి?

నిబంధనలను ఉల్లంఘించి ఉద్యోగాలు కేటాయించారంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు.. బాధితులకు ఇచ్చిన ఉద్యోగ నియామక ఉత్తర్వులను రద్దు చేస్తూ సోమవారం కీలక తీర్పు వెలువరించింది. ఈ తీర్పుతో బాధితుల కుటుంబాలు మళ్లీ ఆందోళనలో పడ్డాయి. కోర్టు తీర్పుపై విజయ్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది? బాధితులకు ప్రత్యామ్నాయంగా ఎలాంటి ఆర్థిక సహాయం అందిస్తుంది? లేదా ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తుందా అనేది ఇప్పుడు తమిళనాడు రాజకీయంలో ఆసక్తికరంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+