Buck Moon: ఎల్లుండి రాత్రి అస్సలు మిస్ కాకండి. ఏడాదికి ఒక్కసారే ..

చందమామ అందాలు, ఆకాశంలో వింతలను చూడాలనుకునే వారికి, ఖగోళ ప్రేమికులకు, ఒక అద్భుతమైన అవకాశం రాబోతోంది. జులై 29న పౌర్ణమి రాత్రి ఆకాశంలో 'బక్ మూన్' (Buck Moon) ప్రత్యేక కాంతులతో దర్శనమివ్వనుంది. అయితే ప్రతీ ఏటా ఈ పౌర్ణమి వేళ జాబిల్లి కాస్త నారింజ, బంగారు లేదా ఎరుపు రంగు ఛాయల్లో కనిపిస్తుంటుంది. దాంతో నిజంగానే చందమామ రంగు మారిపోతుందా? లేక ఇదొక సహజ సిద్ధమైన వెలుగుల వింత? అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. దీని వెనుక ఉన్న అసలు ఖగోళ విజ్ఞానాన్ని ఇప్పుడు చూద్దాం.

నిజంగానే చందమామ రంగు మారుతుందా?

సమాధానం 'అవును'.. కానీ అది మన కంటికి కనిపించే రూపంలో మాత్రమే! జులై 29న చీకటి పడిన తర్వాత ఆకాశంలోకి తొంగిచూసే బక్ మూన్.. హొరైజన్ వద్ద ఉన్నప్పుడు నారింజ, ఎరుపు లేదా ఎర్రటి కాంతిలో కనిపిస్తుంది. అయితే చందమామ ఉపరితలంపై ఎలాంటి రంగు మార్పూ ఉండదు. అది తన సహజసిద్ధమైన వెండి వెలుగులతోనే ఉంటుంది. మరి మనకు రంగు మారినట్లు ఎందుకు కనిపిస్తుందంటే.. అదంతా మన భూమి చుట్టూ ఉండే వాతావరణం చేసే మాయే!

Buck Moon 2026 When and How to Watch the July Full Moon Change Colour Across the Night Sky

ఆ రంగుల వెనుక ఉన్న అసలు సైన్స్!

జాబిల్లి తూర్పున ఉదయిస్తున్నప్పుడు లేదా తక్కువ ఎత్తులో ఉన్నప్పుడు దాని నుంచి వచ్చే కాంతి మన కంటిని చేరడానికి భూమి వాతావరణంలోని చాలా ఎక్కువ పొరల గుండా ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ ప్రయాణంలో గాలిలోని ధూళి కణాలు, నీటి ఆవిరి వల్ల నీలం, ఊదా వంటి తక్కువ వేవ్ లెంత్ ఉన్న రంగుల కాంతి చెదిరిపోతుంది. దీనిని సైన్స్‌లో 'రేలీ స్కాటరింగ్' అంటారు. దీనివల్ల ఎక్కువ వేవ్ లెంత్ ఉన్న ఎరుపు, నారింజ రంగు కాంతులు మాత్రమే నేరుగా మన కంటికి చేరతాయి. మనం రోజూ చూసే సూర్యాస్తమయం వేళ సూర్యుడు ఎర్రగా కనిపించడానికి కూడా ఇదే కారణం.

భూమికి దూరమవుతున్న చంద్రుడు! 60 కోట్ల ఏళ్ల తర్వాత..
భూమికి దూరమవుతున్న చంద్రుడు! 60 కోట్ల ఏళ్ల తర్వాత..

అందరికీ ఒకేలా కనిపిస్తుందా?

వాతావరణ పరిస్థితులు, మనం ఉండే ప్రాంతంలోని గాలి నాణ్యత, కాలుష్యం స్థాయి ఆధారంగా చందమామ రంగు మారుతూ ఉంటుంది. కొందరికి ఇది పసిడి వర్ణంలో, మరికొందరికి దట్టమైన నారింజ లేదా ఎరుపు రంగులో కనిపిస్తుంది. అయితే నింగిలోకి చందమామ పైపైకి ఎదిగే కొద్దీ, కాంతి ప్రయాణించే వాతావరణ పొరల మందం తగ్గుతుంది. దాంతో క్రమంగా జాబిల్లి తన మునుపటి సాధారణ వెండి కాంతిని సంతరించుకుంటుంది.

ఆకాశంలో అద్భుతం- డబుల్ బొనాంజా: కళ్ల ముందు తారాజువ్వల్లా రివ్వుమంటూ
ఆకాశంలో అద్భుతం- డబుల్ బొనాంజా: కళ్ల ముందు తారాజువ్వల్లా రివ్వుమంటూ

బక్ మూన్ చూడటానికి సరైన సమయం ఏది?

ఖగోళ క్యాలెండర్ ప్రకారం జులై 29న నిండు పూర్ణిమ. భారత కాలమానం ప్రకారం రాత్రి 8:05 గంటల సమయంలో ఇది పున్నమి శోభను సంతరించుకుంటుంది. సూర్యాస్తమయం అయిన వెంటనే తూర్పు ఆకాశంలో చందమామ ఉదయిస్తున్నప్పుడు చూడటం వల్ల ఆ ఎర్రటి, నారింజ రంగుల అద్భుత దృశ్యాన్ని స్పష్టంగా వీక్షించవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+