"చంద్రబాబు-సాయిరెడ్డి కలిస్తే ఓకేనా ?"! బోండా ఎపిసోడ్ పై అంబటి పంచ్..!
ఏపీ రాజకీయాల్లో ఎప్పుడూ కీలకంగా ఉండే కులం మరోసారి తెరపైకి వస్తోంది. కాపు నేత ముద్రగడ పద్మనాభం మృతి తర్వాత కాపు నాడు ఆధ్వర్యంలో రాష్ట్రంలో సంతాప సభలు నిర్వహిస్తున్నారు. ఇందులో పార్టీలకు అతీతంగా కాపు నేతలు, ప్రజా ప్రతినిధులు పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో రాజకీయ ప్రత్యర్ధులుగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ(, వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati rambabu) ఓ సమావేశంలో కలిసి మాట్లాడుకోవడం చర్చనీయాంశమైంది.
ఈ నేపథ్యంలో టీడీపీ అధిష్టానం బోండా వ్యవహారంపై తీవ్రంగా స్పందించి వివరణ కోరింది. అంతే కాదు బోండా-అంబటి బేటీపై విచారణకు త్రిసభ్య కమిటీ కూడా ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో బోండా కూడా అంతే దీటుగా స్పందించారు. గతంలో తమ పార్టీకి చెందిన ఇతర నేతలు వైసీపీ కాపు నేతలు ఏర్పాటు చేసిన భేటీలకు వెళ్లలేదా అని ప్రశ్నించారు. దీంతో టీడీపీ అధిష్టానం ఇరుకునపడుతోంది. ఈ నేపథ్యంలో ఈ మొత్తం వివాదానికి కేంద్రంగా మారిన అంబటి రాంబాబు స్పందించారు.

బోండా ఉమ, తాను కలిసిన విషయంపై టీడీపీ అధిష్టానం స్పందిస్తున్న తీరుపై అంబటి రాంబాబు ఘాటు కౌంటర్ ఇచ్చారు. గతంలో చంద్రబాబు వైసీపీ నేతగా ఉన్న విజయసాయిరెడ్డిని కలవలేదా అంటూ వీరిద్దరి ఫోటోతో ఓ ట్వీట్ చేసి ప్రశ్నించారు. నాటి కలయికలో లేని తప్పు నేటి కలయిక (తాను, బోండా ఉమ కలవడం)లో మాత్రమే తప్పు ఎలా కనబడిందంటూ అంబటి ప్రశ్నించారు. దీంతో టీడీపీ అధిష్టానం ఏం చెప్పాలో తెలియక సతమతం అవుతోంది. మరోవైపు కాపు నాడు కూడా ఇదే విషయాన్ని టీడీపీని ప్రశ్నించింది. సాయిరెడ్డి-చంద్రబాబు భేటీ కావచ్చు కానీ అంబటి-బోండా ఉమ కలవకూడదా అని ప్రశ్నిస్తోంది.












Click it and Unblock the Notifications