రాలిపోతున్న సీనియర్స్, పేరుకు మాత్రమే స్వచ్చందం, మోదీ, ఢిల్లీ దెబ్బకు ప్రెస్ మీట్ లో ఇలా!

లోక్‌సభ ఎన్నికలకు మరికొద్ది నెలలు మాత్రమే సమయం ఉంది. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కర్ణాటక బీజేపీలో చాలా ముఖ్యమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బెంగళూరు దక్షిణ లోక్‌సభ నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎంపీ డీవీ సదానంద గౌడ ప్రత్యక్ష ఎన్నికల రాజకీయాల నుండి రిటైర్మెంట్ ప్రకటించి కలకలంరేపారు.

ఇప్పుడు బీజేపీకి చెందిన మరో సీనియర్ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి ఏకంగా ప్రత్యక్ష, పరోక్ష రాజకీయాల నుండి రిటైర్ తీసుకోవాలని నిర్ణయించుకున్నానని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మాజీ మంత్రి, చామరాజనగర్ ఎంపీ వి. శ్రీనివాస్ ప్రసాద్ వచ్చే ఏడాది రాజకీయాల నుంచి రిటైర్మెంట్ ప్రకటించనున్నట్టు తెలిపారు. మార్చి 17న రాజకీయాల నుంచి రిటైర్మెంట్‌ ప్రకటిస్తానని శ్రీనివాస్ ప్రసాద్ డేట్ కూడా చెప్పేశారు.

Senior BJP leaders are voluntarily leaving Rajikayas in Karnataka BJP

రాజకీయాల నుంచి తాను తప్పుకున్న తరువాత నేను ఏ పార్టీకి ప్రచారం చేయనని, ఏ పార్టీకి సలహాలు ఇవ్వనని, మార్చి 17, 2024 నాటికి నేను రాజకీయాల్లోకి ప్రవేశించి 50 సంవత్సరాలు పూర్తి అవుతుందని, మార్చి 17వ తేదీన భారీ సమావేశం నిర్వహించి తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని బీజేపీ సీనియర్ ఎంపీ శ్రీనివాస్ ప్రసాద్ తెలిపారు.

వచ్చే లోక్‌సభ ఎన్నికలకు ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభించిన బీజేపీ హైకమాండ్ కర్ణాటకలో తమ సిట్టింగ్ ఎంపీల్లో కొందరికి టిక్కెట్లు ఇవ్వకూడదని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల సమయంలో మార్చిన విధంగా యువతను ఆకర్షించేందుకు, వయో పరిమితిని బట్టి కొంత మంది సిట్టింగ్ ఎంపీలకు టికెట్లు ఇవ్వకూడదని నిర్ణయించినట్లు సమాచారం.

Senior BJP leaders are voluntarily leaving Rajikayas in Karnataka BJP

లోక్‌సభ ఎన్నికల్లో కొంతమంది సిట్టింగ్ ఎంపీలకు టిక్కెట్లు ఇవ్వకూడదని, కొత్తవాళ్లకు టిక్కెట్లు ఇవ్వాలని బీజేపీ హైకమాండ్ నిర్ణయించిందని తెలిసింది, బెంగళూరు ఉత్తర నియోజకవర్గ ఎంపీ, మాజీ ముఖ్యమంత్రి సదానంద గౌడ ఇప్పటికే ఎన్నికల రాజకీయాల నుండి రిటైర్మెంట్ ప్రకటించారు. అలాగే వచ్చే మార్చిలో రాజకీయాల నుంచి రిటైర్మెంట్ ప్రకటిస్తానని చామరాజనగర్ ఎంపీ శ్రీనివాస ప్రసాద్ తెలిపారు.

చిక్కబళ్లాపురం ఎంపీ బచ్చేగౌడ, కోలారు ఎంపీ మునిస్వామి, విజయపుర ఎంపీ రమేష్ జిగజినాగి, తుమకూరు ఎంపీ జి. బసవరాజు, కొప్పల్ ఎంపీ సంగన్న, దావణగెరె ఎంపీ జీ.ఎం. సిద్దేశ్వర్ సహా పలువురు సిట్టింగ్ ఎంపీలకు టిక్కెట్లు ఇవ్వకూడదని బీజేపీ హైకమాండ్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. అంతే కాకుండా బీజేపీ కర్ణాటక శాఖ మాజీ అధ్యక్షుడు నలీన్ కుమార్ కటీల్ కు కూడా ఈసారి బీజేపీ టికెట్ దక్కుతుందని నమ్మకం లేదని బీజేపీ నాయకులు అంటున్నారు. అనారోగ్యం కారణంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చిన ఉత్తర కన్నడ నియోజకవర్గ ఎంపీ అనంత్ కుమార్ హెగ్డేకి కూడా టిక్కెట్టు దక్కే అవకాశాలు కనిపించడం లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+